Friday, May 17, 2024
- Advertisement -

మెగాస్టార్ రికార్డును బద్దలు కొట్టిన పవర్ స్టార్!

- Advertisement -
Pawan Kalyan Breaks Chiranjeevi Record

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటివలే ఈ సినిమాకి సంబంధించి టీజర్ ను రిలీజ్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ టీజర్ రికార్డులను తిరగరాస్తోంది. అర నిముషం నిడివిగల ఈ వీడియో రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే మూడు మిలియన్ వ్యూస్ ని దాటేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డాలీ డైరెక్షన్ లో శరత్ మరార్ నిర్మిస్తున్న కాటమ రాయుడు టీజర్ ని చూసేందుకు అభిమానులు, నెటిజనులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.

టాలీవుడ్ సినిమాల్లో ఇప్పటివరకు అత్యధిక వ్యూస్ సాధించిన  టీజర్ గా మెగాస్టార్ చిరంజీవి ఖైధీనంబర్ 150 రికార్డు నెలకొల్పింది. దీనిని 7.41 మిలియన్ల మంది చూసారు. ఆ మార్క్ ని కాటమరాయుడు దాటేశాడు. 7.77 మిలియన్ల వ్యూస్ ని పవన్ సినిమా టీజర్ సొంతం చేసుకుంది. ట్రైలర్ వచ్చేవరకు ఈ దూకుడు అలాగే ఉంటుంది. దీంతో ఇప్పటిదాక టాలీవుడ్ లో తక్కువ సమయంలో అత్యధిక మంది వీక్షించిన టీజర్ గా ‘కాటమరాయుడు’ రికార్డ్ సృష్టించింది. పవర్ స్టార్ మొదటి సారి ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 24 న విడుదల కానుంది.

Related

  1. మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్!
  2. 15 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్‌…!
  3. మెగాస్టార్ కు ఇంతకన్నా రికార్డు మరోటి లేదు..!
  4. అప్పుడే.. ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -