Thursday, April 25, 2024
- Advertisement -

అర్ధరాత్రి పూట చావుబతుకుల్లో ఆదుకున్న హీరో..!

- Advertisement -

ప్రస్తుతం ఉన్న కరోనా కాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు చేసిన చిన్న సహాయానికి కూడా విపరీతమైన పబ్లిసిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు మాత్రం నటుడు సోనుసూద్ తో పోల్చి మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ అతనిపై విమర్శలు చేస్తున్నారు.చిరంజీవి కూడా కరోనా బాధితుల కోసం తనకు తోచిన సహాయం చేస్తున్నారని, ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవిని తక్కువ చేసి మాట్లాడుతున్న వారిపై కొరియోగ్రాఫర్ సందీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీసీఎస్ ద్వారాఎంతో మంది సినీ కార్మికులను ఆదుకొని ప్రస్తుతం కొన్ని కోట్ల డబ్బు ఖర్చు చేసి రెండు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొందరు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.ఈ విధంగా చిరంజీవిగారిని విమర్శలు చేసే వారిపై కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న సమయంలో ఈ విధంగా చిరంజీవి గారు మాత్రమే సహాయం చేయకుండా మెగా ఫ్యామిలీ కూడా ఆపద సమయంలో ఆదుకోవడానికి ముందుంటారని తెలియజేస్తూ మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ తనకు అర్థరాత్రి చేసిన సహాయాన్ని తెలిపారు.

Also read:లీకైన చిరంజీవి ఫోన్ కాల్ సంభాషణ… మీడియా అధినేతతో అలా మాట్లాడిన చిరు?

సందీప్ మాట్లాడుతూ …కిమ్స్ హాస్పటల్‌లో క్రిటికల్ కండిషన్‌లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మా తండ్రిని చూసి ఏం చేయాలో దిక్కు తోచక మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ గారికి ఫోన్ చేసి మా నాన్నను అపోలోకు తీసుకువెళ్లాలి అనుకుంటున్నా కాస్త సహాయం చేస్తారా? అని అడిగాను. అప్పుడు కళ్యాణ్ ఇలాంటి క్రిటికల్ కండిషన్ లో హాస్పిటల్ మార్చడం అంత మంచిది కాదని చెప్పి హాస్పిటల్లో ఉన్న డాక్టర్లతో ముందుగా మాట్లాడే తన తండ్రి పరిస్థితిని తెలుసుకున్న కళ్యాణ్ తెల్లవారుజామున మూడు గంటల వరకు నాకు ఎంతో ధైర్యం చెప్పారు. అప్పటికే మా నాన్న పరిస్థితి చేజారిపోయిందని తెలుసుకున్న కళ్యాణ్ విషయం నాకు చెప్పకుండా నా భార్యకు చెప్పి ముందుగా మమ్మల్ని ప్రిపేర్ చేశారు. తర్వాత ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే తప్పకుండా తనకి తెలపాలని కళ్యాణ్ దేవ్ చెప్పినట్లు తెలిపారు. ఆపద సమయంలో డబ్బులు ముఖ్యం కాదు కానీ మన కష్టాన్ని పంచుకోవడం ఎంతో ముఖ్యమని, ఈ విధంగా కష్టాన్ని పంచుకోవడంలో మెగా కుటుంబం ముందు వరుసలో ఉంటుందని కొరియోగ్రాఫర్ సందీప్ బావోద్వేగం అయ్యారు.

Also read:సాధారణ స్థితికి రావడానికి రెండు నెలల సమయం పట్టింది: తమన్నా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -