Friday, April 26, 2024
- Advertisement -

తగ్గేదే లే అంటున్న వైఎస్ షర్మిల.. సీఎం కేసీఆర్ ఇలాకాలో పర్యటన

- Advertisement -

తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని వారికి న్యాయం జరగాలని 72 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. అంతే కాదు తెలంగాణలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా నేను ఉన్నా అంటూ ముందుకు వస్తున్నారు.

సమయం చిక్కినప్పుడల్లా తెలంగాణ ప్రభుత్వంపై తనదైన విమర్శలు చేస్తున్నారు షర్మిల. తన రాజకీయ కార్యాచరణను మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటి వరకు తన కార్యాలయంలో జిల్లా నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలను నిర్వహించిన ఆమె… ఇకపై క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మొదట సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ తో తన రాష్ట్ర పర్యటనను ప్రారంభించనున్నారు.

రేపు ఉదయం హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించిన తర్వాత… అక్కడి నుంచి గజ్వేల్ కు పయనమవుతారు. జూన్ నెలలో పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటిస్తానని వెల్లడించారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, రిటైర్డ్ ఉన్నతాధికారులు ఆమెను కలిసి మద్దతును ప్రకటించడం గమనార్హం.

జబర్దస్త్ గెటప్ శ్రీను భార్యని వదిలిపెట్టని హ్యాకర్లు.. ఆమెకు అండగా జబర్దస్త్ టీమ్!

పొట్టి నిక్కర్ లో.. వింత ఎక్స్ప్రెషన్స్ తో.. హల్ చల్ చేస్తున్న అర్జున్ రెడ్డి బామ!

నేటి పంచాంగం,మంగళవారం(01-06-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -