Friday, April 26, 2024
- Advertisement -

డైరెక్టర్ గా స్టార్ కమెడియన్..!

- Advertisement -

వెన్నెల కిషోర్ స్టార్ కమెడియన్ గా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెన్నెల సినిమాతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన కిషోర్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెన్నెల కిషోర్ గా పేరుతెచ్చుకున్నాడు. వెన్నెల సినిమా విడుదలైన తర్వాత కిషోర్ ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఆయనకు అవకాశాలు క్యూ కట్టాయి.

ప్రస్తుతం వెన్నెలకిషోర్ టాలీవుడ్ లో టాప్ కమెడియన్ లలో ఒకరు. వెన్నెల కిషోర్ తాజాగా తనలోని మరో టాలెంట్ బయట పెట్టబోతున్నాడు. దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఆయన దర్శకత్వం వహించేది సినిమాకు కాదు.. వెబ్ సిరీస్ కు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా అనే ఓటీటీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సినిమాలు ప్రత్యేక షోలతో పాటు వెబ్ సీరిస్ లను కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. తాజాగా ఆహాలో విడుదలైన వెబ్ సిరీస్ కుడి ఎడమైతే దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Also Read: ఈ భామ జోరు చూస్తే ..పూజా హెగ్డే, రష్మికకు ఎసరు పెట్టేలా ఉందే..!

ప్రస్తుతం ఆహాలో వెబ్ సిరీస్ కోసం వెన్నెల దర్శకత్వం వహించనున్నాడు. అయితే తాను దర్శకత్వం వహించే వెబ్ సిరీస్ లో వెన్నెల కిషోరే మెయిన్ లీడ్ లో కనిపించనున్నారు. ఇటీవల కొత్త కొత్త సినిమాలను ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే వరుసబెట్టి వెబ్ సిరీస్ లను కూడా ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆహా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లకు పోటీ గా మారుతోంది.

Also Read: పాపం సిద్ధార్థ్.. హీరోల వయసు టాపిక్ వస్తే చాలు.. వెళ్ళనీ అతడి వైపే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -