పాపం సిద్ధార్థ్.. హీరోల వయసు టాపిక్ వస్తే చాలు.. వెళ్ళనీ అతడి వైపే..!

- Advertisement -

అసలే హీరో సిద్ధార్థ్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమాల పట్ల అలిగాడు. బాయ్స్ అనే తమిళ సినిమా ద్వారా అరంగేట్రం చేసిన సిద్ధార్థ్ కు ఆ తర్వాత తమిళం కంటే తెలుగు లోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఆయన కెరీర్ ప్రారంభంలోనే తెలుగులో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి సినిమాలు బంపర్ హిట్లు కావడంతో అతని క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అయితే కెరీర్ ఆరంభంలో తెలుగులో వరుసగా హిట్లు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఎందుకో తెలుగులో అతడికి సరైన హిట్లు పడలేదు.

ఎంత మంచి సినిమా చేసిన తెలుగు ప్రేక్షకులు ఆదరించారంటూ అలిగిన సిద్ధార్థ్ మళ్లీ తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు. కొన్నేళ్లుగా అక్కడే సినిమాలు చేస్తున్నాడు. తెలుగు నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా తిరస్కరిస్తూ వచ్చాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత సిద్ధార్థ్ మళ్ళీ ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ తో పాటు శర్వానంద్ కూడా హీరోగా నటిస్తున్నాడు.

- Advertisement -

కాగా బొమ్మరిల్లు సినిమా విడుదలైన సమయంలో మొదటిసారి సిద్ధార్థ్ వయసు గురించి ఓ టాపిక్ చర్చకు వచ్చింది. సిద్ధార్థ్ ఓ టీవీ ఛానల్ లైవ్ లో ఉండగా ఓ వ్యక్తి ఫోన్ చేసి మీరు నిజ జీవితంలో ప్రకాష్ రాజ్ కంటే పెద్దవారు కదా.. ప్రకాష్ రాజ్ కు కొడుకుగా ఎలా నటించారు అంటూ.. ప్రశ్నించాడు. దీంతో అతడిపై సిద్ధార్థ ఫైర్ అయ్యారు. ఎవరు చెప్పారు..నేను ప్రకాష్ రాజ్ కంటే పెద్ద వాడినని అంటూ మండిపడ్డారు. అప్పట్నుంచి సిద్ధార్థ్ వయసుపై తరచూ వార్తలు వస్తుంటాయి. సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది.

అయితే ఇప్పుడు మరోసారి సిద్ధార్థ వయస్సు గురించి టాపిక్ నడుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నారప్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేష్ వయసు పై కొందరు ట్విట్టర్ వేదికగా ట్రోల్స్ చేశారు. వెంకీ పక్కన యువ హీరోయిన్లు అవసరమా..అని కొందరు కామెంట్స్ చేశారు. దీంతో వెంకీ కి సపోర్ట్ గా కొంతమంది కామెంట్స్ చేశారు. 40 ఏళ్లకు పైగా వయసున్న సిద్ధార్థ్ తో 20 ఏళ్ల వయసున్న హీరోయిన్లు నటిస్తే టాపిక్ కాదు కానీ.. వెంకటేష్ పక్కన నటిస్తే ఏంటని.. కామెంట్ చేశారు.

ఈ కామెంట్స్ సిద్ధార్థ్ కంట పడ్డాయి. వీటిపై సిద్ధార్థ్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ‘ ఏ హీరోల వయసు టాపిక్ లో ఫస్ట్ నేనే గుర్తుకొచ్చానా రా? సూపర్ రా దరిద్రం. ఎక్కడనుంచి వస్తారురా మీ లాంటోళ్లు? ‘అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీ పై తన అలకమాని సినిమాలు ఒప్పుకుంటున్న సిద్ధార్థ్ ను.. మరోసారి నెటిజన్లు కెలుకుతున్నారు. ఈసారి సిద్ధార్థ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -