ఈ భామ జోరు చూస్తే ..పూజా హెగ్డే, రష్మికకు ఎసరు పెట్టేలా ఉందే..!

- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర హీరోయిన్లు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది పూజ హెగ్డే, రష్మిక మందన్న. పూజా హెగ్డే తెలుగులో తొలి సినిమా ముకుంద. ఈ సినిమాకంటే ముందే ఆమె తమిళ్ లో హిందీలో హీరోయిన్ గా నటించింది. అయితే అక్కడ ఆమెకు గుర్తింపు రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీ వైపు వచ్చింది. అయితే ఆమె హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి సుమారు పదేళ్లు అవుతోంది. అయితే ఆలస్యంగా అయినా ఆమె స్టార్ హీరోయిన్ గా మారింది.

ఇక రష్మిక మందన్న తన తొలి సినిమా ఛలోతోనే మాంచి గుర్తింపు సాధించింది. రెండో సినిమా గీత గోవిందం, మూడో సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాలు సూపర్ హిట్ కావడంతో.. మూడే మూడు సినిమాలతో టాప్ హీరోయిన్ గా మారింది. అయితే పూజా హెగ్డే, రష్మిక కు ఒక్క తెలుగులోనే కాదు తమిళ్ హిందీ లో కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో వీరు తెలుగులో తక్కువ సినిమాల్లో నటిస్తున్నారు.

- Advertisement -

అయితే ఇదే తడవుగా ఉప్పెన మూవీతో సూపర్ హిట్ అందుకొని గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి తెలుగులో దూసుకుపోతోంది. రష్మిక, పూజా హెగ్డే అందుబాటులో లేకపోవడంతో చాలామంది కృతి శెట్టి వైపు చూస్తున్నారు. వరుసగా ఆమెకు తెలుగు హీరోలు అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం కృతి శెట్టి నానితో శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు తో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రామ్ తో ఉస్తాద్ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు నితిన్ నటించే ఓ కొత్త సినిమాలో కూడా కృతి శెట్టికి చాన్స్ దక్కినట్లు సమాచారం.

ఈ సినిమాలే కాకుండా అఖిల్ అక్కినేని నటించే ఓ సినిమా, వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న మరో సినిమా, వీటితో పాటు విజయ్ దేవరకొండ నటించే కొత్త సినిమా లో కృతి శెట్టికి హీరోయిన్ గా అవకాశాలు వచ్చినట్లు సమాచారం. తెలుగులో ప్రస్తుతం ఆమె చేతిలో ఏడెనిమిది సినిమాలున్నాయి. మరే హీరోయిన్ చేతిలో ఇన్ని సినిమాలు లేవు. మెల్లగా కృతి పూజా హెగ్డే, రష్మిక మందన్నలకు ఎసరు పెట్టేలా కనిపిస్తోంది.

Also Read

థర్డ్​వేవ్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

అగ్ర హీరోల సినిమాలూ ఓటీటీ బాటే.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్​..!

సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -