Wednesday, April 24, 2024
- Advertisement -

జీవితకు.. బాలయ్య సపోర్ట్​? మా ఎన్నికలు మరింత హీట్​..!

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మా ఎన్నికల హీట్​ నెలకొన్నది. చిరంజీవి సపోర్ట్​తో విలక్షణ నటుడు ప్రకాశ్​ రాజు బరిలో నిలిచినట్లు వార్తలు వస్తుండగా,మోహన్​బాబు తన కుమారుడు విష్ణును పోటీలో నిలబెట్టబోతున్నారు. అయితే మోహన్​బాబు సినీ పెద్దల మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన కృష్ణ, కృష్ణం రాజు వంటి సీనియర్​ నటులను కలుసుకున్నారు.

మరోవైపు మా అధ్యక్షుడిగా పక్క రాష్ట్రం వ్యక్తి అవసరమా? అంటూ కొత్త నినాదాన్ని ఎంచుకున్నారు. కానీ ప్రకాశ్​రాజ్ కు చిరంజీవి అండదండలు ఉన్నాయని అంటుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఈ సారి తాను కూడా పోటీ చేయబోతున్నట్టు జీవితా రాజశేఖర్​ ప్రకటించారు.అంతేకాక ఆమెకు నందమూరి బాలకృష్ణ మద్దతు తెలుపుతున్నాడని సమాచారం. దీంతో అసలు ఆట మొదలైంది. పోటీ ప్రకాశ్​ రాజ్​, మంచు విష్ణు మధ్య ఉంటుందని భావించగా జీవిత రాజశేఖర్​ ఎంట్రీ ఇవ్వడం .. ఆమెకు బాలయ్య బాబు సపోర్ట్​ చేస్తున్నట్టు వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.

అయితే పవన్​కల్యాణ్, మహేశ్​బాబు, ఎన్టీఆర్​ ఎటువైపు నిలవబోతున్నారో ఇంకా క్లారిటీ లేదు. నిజానికి సీనీ పరిశ్రమలో రెండు సామాజిక వర్గాలదే పెత్తనం.. ప్రతి సారి ఆ మార్కు కచ్చితంగా కనిపిస్తుంది. ఈ సారి పోటీ మాత్రం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా మా ఎన్నికలు జరగబోతున్నట్టు ఫిలింనగర్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read

ఏడాదిలో రూ.150 కోట్లు వదులుకున్న ప్రభాస్..?

చిత్రపరిశ్రమలో ఎన్నికల వేడి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -