Friday, April 26, 2024
- Advertisement -

మీకు తెలుసా.. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటిష్ ని వణికించిన ఉద్యమం మరొకటుందని..

- Advertisement -

ఎందరో రాజుల పరిపాలన అనంతరం మనదేశం వర్తక, వాణిజ్యం పేరుతో మన దేశానికి వచ్చిన బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రజల బతుకులు బానిసలుగా మారి.. పరాయి పాలకుల చేతిలో నలిగి పోయాయి. ఆ తర్వాత ఒక్కొక్కరుగా బ్రిటిష్ పాలనను వ్యతిరేకించడం మొదలు పెట్టారు. ఎందరో ఉద్యమ వీరులు బ్రిటిష్ వారిని ఎదిరించి తమ ప్రాణాలను త్యాగం చేశారు. 1857లో తొలిసారిగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సిపాయిలు తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం మొదలైంది ఈ తిరుగుబాటుతోనే అని చెబుతారు. కానీ ఈ పోరాటానికి ముందే అంటే 1857 ఏడాది ఆరంభంలో దేశంలో చపాతీల ఉద్యమం ప్రారంభమైంది. అయితే ఈ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారో.. ఎందుకు ప్రారంభించారో తెలియదు. ఉద్యమం మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగింది. దేశ వ్యాప్తంగా అన్ని ఊర్లలోనూ చపాతీ ఉద్యమం నడిచింది.

మొదట్లో అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ వ్యక్తి.. గ్రామంలోని కాపలాదారుడికి చపాతీలు ఇచ్చి వాటిని ఊరంతా పంచాలని చెప్పాడట. ఆ తర్వాత ఈ చపాతీలు పొందినవారు మరికొన్ని చపాతీలు చేసి ఇతరులకు పంచాలని సూచించాడట. ఒక గ్రామంలో మొదలైన చపాతీ ఉద్యమం క్రమంగా ఉత్తర భారతదేశం, ఆ తర్వాత దేశ వ్యాప్తంగా వ్యాపించింది. ప్రతిరోజు బ్రిటిష్ పోలీస్ స్టేషన్లకు చపాతీలు చేరేవి. ఈ చపాతీల ఉద్యమం మొదలైనట్లు 1857 ఫిబ్రవరిలో తొలిసారి మథుర లోని బ్రిటిష్ పోలీసు అధికారికి థోర్న్ హిల్ కి తెలిసింది. గ్రామస్తులు గ్రామ కాపలాదారుడికి చపాతీలు ఇచ్చి రోజు పోలీసు స్టేషన్లకు చేర వేస్తున్నట్లు ఆయన తెలుసు కున్నారు. చపాతీ ఉద్యమం గురించి ఆరా తీయగా ఆయనకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

Also Read: ఆ పాన్ ఇండియా డైరెక్టర్ కు.. ఫస్ట్ టైం రిస్కు తప్పదేమో..

రాత్రుళ్లు కొందరు వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చి చపాతీలు పంచుతున్నారని.. ఆ తర్వాత వాటిని గ్రామస్తులు వందల కిలోమీటర్లు చేరవేస్తున్నారని తెలుసుకున్నారు. ప్రజలు చపాతీల ద్వారా ఏదో ఉద్యమం చేస్తున్నారని.. బ్రిటిష్ వారు భావించారు. చపాతీల్లో ఏమైనా రాసి ఉందా అని చూసేవారు. అసలు ఆ ఉద్యమం ఎందుకు జరుగుతుందో అర్థం కాక బ్రిటీష్ వారి గుండెల్లో అలజడి రేగింది. అసలు ఉద్యమం ఎక్కడ మొదలైందో తెలుసుకునేందుకు వారు ఎంత ప్రయత్నించినా వివరాలు ఏమీ తెలియలేదు. కొందరు చపాతీలు దక్షిణ భారతదేశం నుంచి వస్తున్నాయని.. మరికొందరు కోల్ కతా నుంచి వస్తున్నాయని చెప్పేవారు. కానీ ఆ ఉద్యమం ఎక్కడ మొదలైంది.. చపాతీలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది కనుక్కోలేకపోయారు.

ఈ చపాతీల ఉద్యమం ఉద్దేశం ఏంటో, దానిని నడిపిన నాయకుడు ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఈ ఉద్యమం మాత్రం బ్రిటిష్ పాలకులను భయపెట్టింది. ఏదో జరుగుతోంది.. ఏదో జరుగుతోందని.. వారు ఆందోళన చెందుతూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు. ఈ ఉద్యమం జరిగిన తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటు, ఆ తర్వాత ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి పోరాటాలు జరిగాయి. బ్రిటిష్ వారిని వణికించిన చపాతీ ఉద్యమం గురించి ఎక్కడ ఏ వివరాలు పెద్దగా లేవు. దీనిని నిర్వహించింది.. ఎవరో చివరి వరకూ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.

Also Read: సమకాలిన స్టార్ హీరోల సమరం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -