Thursday, April 25, 2024
- Advertisement -

ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసిన పవన్ కళ్యాన్.. రేటు ఎంతో తెలుసా..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాన్. రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటున్నాడని టాలీవుడ్ టాక్. ఒక్కో సినిమాకి సుమారు 50 కోట్ల వరకు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

సెలబ్రిటీలు తమ స్టేటస్ కు తగ్గట్టుగా లగ్జరీ కార్లల్లో తిరుగుతుంటారు. కానీ పవన్ మాత్రం ఎప్పుడూ వాటిపై పెద్దగా మోజు పడినట్లు అనిపించదు. దాదాపు అయిదారేళ్లుగా ఓ పాతకారునే వాడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నారు. యితే ఇప్పుడు ఒక ఖరీదైన కారును బుక్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.4 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ – ఆటోబయోగ్రఫీ మోడల్ కారును పవన్ పేరు మీద బుక్ చేసినట్లుగా ఫిలిమ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ కారు పవన్ ఇంటికి డెలివరీకి రానున్నట్లు తెలుస్తోంది.

ఇటాంటి మోడల్ కార్లు అమితాబ్ బచ్చన్,షారూఖ్ ఖాన్,రణబీర్ కపూర్ – ప్రభాస్ వంటి హీరోల దగ్గర ఉన్నట్లు సమాచారం. మొత్తానికి జాబితాలో ఇప్పుడు పవన్ కూడా చేరిపోనున్నాడు. పవన్ తన ఫ్యామిలీ కోసం పర్సనల్ అవసరాల కోసం ఈ కారుని కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది.

రవితేజ కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసింది..!

మహమ్మారి మబ్బులనూ ఛేదించాయ్..! తొలి ఆరు నెలల్లో నాలుగు బ్లాక్ బస్టర్లు

విడుదలకు ముందే వాలిమై రికార్డుల హోరు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -