Wednesday, April 24, 2024
- Advertisement -

ఒక్క సినిమా హిట్ కొట్టు.. నాని సినిమా పట్టు..!

- Advertisement -

టాలీవుడ్ లో అతి వేగంగా సినిమాలు తీసే హీరోల్లో నాని ఒకడు. తన సినిమాలు కనీసం ఏడాదికి మూడు అయినా విడుదలయ్యేలా నాని ప్లాన్ చేసుకుంటాడు. తన కెరీర్ లో నాని ఎక్కువ సినిమాలు కొత్త దర్శకులకే ఛాన్స్ ఇచ్చాడు. ఓ మై ఫ్రెండ్ సినిమా చేసిన వేణు శ్రీరామ్ కి ఎంసీఏ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు నాని. అలాగే డైరెక్టర్ మారుతి కి పెద్ద బ్రేక్ ఇచ్చాడు నాని. ఈ రోజుల్లో, బస్ స్టాప్ మూవీల తర్వాత మారుతితో నాని భలే భలే మగాడివోయ్ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు.

ఇక ఇప్పుడు కొత్త దర్శకులు ఒక్క హిట్టూ ఇస్తే చాలు నాని వాళ్లకు పిలిచి మరీ రెండవ చాన్స్ ఇస్తున్నాడు. డైరెక్టర్ విరించి వర్మ తన తొలి సినిమా ఉయ్యాల జంపాల సినిమా తీయగానే, రెండో సినిమా కు అవకాశం ఇచ్చాడు. అలా నిర్మితమైన మూవీనే మజ్ను. ప్రస్తుతం నాని నుంచి వస్తున్న మూడు సినిమాల్లో మూడు సినిమాలు నూతన దర్శకులు చేస్తున్నవే. శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని చేసిన సినిమా నిన్ను కోరి. ఇప్పుడు దర్శకుడికి టక్ జగదీశ్ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు నాని.

అలాగే ట్యాక్సీ వాలాతో విజయ్ దేవరకొండకు హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీతో పాటు బ్రోచేవారెవరురా సినిమా డైరెక్టర్ వివేక్ తో నాని ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇలా వరుసగా నూతన దర్శకులకు నాని అవకాశం ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు.

Also Read

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది.. చాప కింద నీరులా తమిళ తంబీలు..!

ఆ ఇద్దరు అగ్ర హీరోలూ.. అలా చేయడం ఇదే తొలిసారి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -