Thursday, May 2, 2024
- Advertisement -

ఈ సినిమాకి పది ఫస్ట్ లుక్ లు

- Advertisement -

ఫస్ట్ లుక్ అంటే ఒకప్పుడు ఒక్క లుక్కే రిలీజ్ చేసేవాళ్లు. కానీ ఈ మధ్య సీన్ మారింది. ఒకేసారి రెండు మూడు లుక్స్ రిలీజ్ చేస్తున్నారు. ఐతే కృష్ణవంశీ ఇప్పుడు సరికొత్త ట్రెండుకు శ్రీకారం చుడుతున్నాడు.

తన కొత్త సినిమా ‘నక్షత్రం’కు సంబంధించి రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా పది లుక్స్ ఒకేసారి రిలీజ్ చేయబోతున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఆ లుక్స్ రిలీజ్ చేయబోయేది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కావడం విశేషం. కృష్ణవంశీ లాస్ట్ మూవీ ‘గోవిందుడు అందరివాడేలే’లో హీరో చరణే. ఆ సాన్నిహిత్యంతోనే నక్షత్రం ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయబోతున్నాడు చరణ్.ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో కృష్ణవంశీ వెల్లడించాడు. ‘‘నా గోవిందుడు.. ధృవ నక్షత్రం.. నా ప్రియమైన 

రామ్ చరణ్ త్వరలోనే ‘నక్షత్రం’ పది ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేస్తాడు. నిరీక్షణ మొదలు’’ అని అన్నాడు కృష్ణవంశీ. రెజీనా కథానాయికగా నటిస్తున్న ‘నక్షత్రం’లో సాయిధరమ్ తేజ్.. ప్రగ్యా జైశ్వాల్ అతిథి పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని జెనిమి కిరణ్ నిర్మిస్తున్నాడు. కృష్ణవంశీ నుంచి ఆయన స్థాయికి తగ్గ సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. ‘చందమామ’ తర్వాత ఒక్క హిట్టూ కొట్టేదాయన. వరుస ఫ్లాపుల తర్వాత ‘గోవిందుడు అందిరివాడేలే’ పర్వాలేదనిపించినా అందులో కృష్ణవంశీ మార్కు మిస్సయింది. ‘నక్షత్రం’ మళ్లీ కృష్ణవంశీ ముద్ర చూపిస్తుందేమో చూడాలి.

{youtube}0VIoQ5zhx5k{/youtube}

Related

  1. కృష్ణ వంశీ దర్సకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ’నక్షత్రం’
  2. చరణ్ ధృవ సినిమాలో అల్లు అర్జున్!
  3. రామ్ చరణ్ ధృవ రిలీజ్ డేట్!
  4. డ్రెస్ స్లిప్ అయిన రాంప్ వాక్ చేసిన రెజీనా (వీడియో)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -