తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్‌కి సినిమాని తెలుగులో రామ్ చరణ్ దృవ గా రీమేక్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. గీత ఆర్ట్స్ బేనర్ ఈ చిత్రంను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామి కనిపించనున్నాడు.
ఈ సినిమాకి సంబంధించి ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ చిత్రంలో మరో మెగా హీరో నటించనున్నాడు. అతను ఎవరో కాదు.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఎవడు సినిమా కోసం జతకట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కాబోతుందట. ఈ సినిమాలో అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు సురేందర్‌రెడ్డికి ఈ ఆలోచన వచ్చిందట, దీనిపై బన్నీతో చర్చిండం, బన్నీ కూడా సానుకూలంగా స్పదించడం జరిగిందని అంటున్నారు. బన్నీ కూడా ఈ చిత్రంలో నటించడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.
Related
