Friday, April 26, 2024
- Advertisement -

Aamir – Kiran Divorce: అమీర్​.. కిరణ్ రావు విడిపోవడానికి కారణం ఆమె నా..?

- Advertisement -

సినీ నటుల వ్యక్తిగత జీవితాలు మీడియాకు ఎప్పుడూ ఓ హాట్​ టాపిక్​. సెలబ్రిటీల జీవితాల్లో ఏదైనా అనుకోని ఘటన జరిగితే గోరంతను కొండంత చేసి చూపించడం కూడా కామనే. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్​ అగ్రనటుడు అమీర్​ ఖాన్​ ఆయన భార్య కిరణ్​రావు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వార్త దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు? అసలేం జరిగింది? అన్న విషయాలపై నెటిజన్లు విపరీతమైన ఆసక్తి కనబరిచారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ కొత్త అంశం తెరమీదకు వచ్చింది.

అదేమిటంటే.. అమీర్​ ఖాన్​ మరో నటి ఫాతిమాతో అఫైర్​ పెట్టుకున్నాడని అందుకే భార్యతో విడాకులు తీసుకున్నాడని నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్​ చేస్తున్నారు. గతంలో ఫాతిమా, అమీర్​ ఖాన్​ దంగల్​ సినిమాలో నటించారు. ఆ తర్వాత పలుమార్లు వీళ్లు మీడియా కంట పడ్డారు. ఇక వయసు రీత్యా వీరిమధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ చాలా రోజులుగా ఓ రేంజ్​లో పుకార్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా నెటిజన్లు అమీర్​ఖాన్​, ఫాతిమా అఫైర్​ విషయాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు. పైగా కొందరు చాలా దారుణమైన కామెంట్లు పెడుతున్నారు.

Also Read: చిరు వర్సెస్​ మోహన్​బాబు

‘అమీర్​ ఖాన్​ మనదేశంలో భావ ప్రకటనా స్వేచ్చ లేదని.. నేనూ, నా భార్య విదేశాలకు వెళ్లాలని చూస్తున్నామంటూ గతంలో వ్యాఖ్యానించావు కదా. ఇప్పుడు మేము కూడా భావప్రకటనా స్వేచ్ఛతోనే చెబుతున్నాము. మీకు నటి ఫాతిమాకు మధ్య ఏదో ఉంది. ఈ విషయాన్ని మేము బహిరంగంగా చెబుతున్నాము. ఎందుకంటే మాకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. మమ్మల్ని ఎవరూ? ఆపలేరు?’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: అగ్ర హీరోలూ ఈ సారైనా వెండితెరపై దర్శనమిస్తారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -