వెబ్ సిరీస్ లలో స్టార్ హీరో.. ఎవరంటే?

- Advertisement -

ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది.కరోనా కారణంగా ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తు,ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండటంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. దీంతో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి తరుణంలో వారిని ఆకర్షించడానికి అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా వంటి బడా సంస్థలు పలు వెబ్ సిరీస్ నిర్మించి ప్రజలను ఆకట్టుకున్నారు.

ఇలాంటి తరుణంలో చాలా మంది అగ్ర నటీనటులు ఇప్పటికే వెబ్ సిరీస్ బాటపట్టారు. తాజాగా టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ వెబ్ సిరీస్లో నటించడానికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది.తాజాగా దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ వెబ్ సిరీస్ కు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. డైరెక్టర్ వెంకటేష్ మహా ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత విక్టరీ వెంకటేష్ తో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ అమెజాన్ ప్రైమ్ దీన్ని నిర్మిస్తోంది.

- Advertisement -

Also read:M Tech పూర్తి చేశా కానీ రూ. 200 సంపాదించా: కెవ్వు కార్తీక్

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తెలుగులో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న నారప్ప సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే దృశ్యం 2 సినిమా దాదాపుగా పూర్తయింది. దీంతో పాటు విక్టరీ వెంకటేష్ హీరో వరుణ్ కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో “ఎఫ్ 3 “మూవీలో నటిస్తున్నాడు.ఈ మూవీ షూటింగ్ దాదాపు 50శాతం కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.

Also read:అక్కడ అసభ్యకరంగా తాకాడు.. చచ్చేలా కొట్టా: నవ్య స్వామి

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -