Tuesday, April 23, 2024
- Advertisement -

దిల్ రాజ్ అజయ్ దేవగణ్ కాంబినేషన్ లో నాంది హిందీ రీమేక్..!

- Advertisement -

ఈ ఏడాది ఆరంభంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘నాంది’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా హిట్ కు దూరంగా ఉన్న అల్లరి నరేష్ కు ఈ సినిమా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది ఈ చిత్రం. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. ఇటీవల వరుసగా తెలుగు సినిమాలను హిందీలో రీమిక్స్ చేస్తున్న దిల్ రాజు ఈ సినిమాను కూడా రీమేక్ చేస్తున్నారు.

ఇప్పటికే దిల్ రాజు జెర్సీ, హిట్, ఎఫ్ 3 సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. లైక్ మైండెడ్ ప్రొడ్యూసర్స్ తో కలసి దిల్ రాజు సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా స్టార్ హీరో అజయ్ దేవగణ్ తో నాంది సినిమా హిందీ రీమేక్ చేపట్టనున్నారు. ఈ విషయాన్ని అజయ్ దేవగణ్ కూడా కన్ఫర్మ్ చేశారు.

దిల్ రాజుతో కలిసి హిందీలో ‘నాంది’ని రీమేక్ చేస్తున్నట్టు అజయ్ దేవగణ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు తెలియజేయనున్నారు. నాంది సినిమా న్యాయ వ్యవస్థలోని లోపాలనే కాకుండా, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 211 ద్వారా ఎలాంటి న్యాయం పొందవచ్చో తెలియజేసింది. సతీష్ వేగ్నేశ ఈ సినిమాను నిర్మించగా విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు.

Also Read

తెలుగు హీరోలు ‘నో’ చెప్పినా.. తమిళ హీరో ‘ఎస్’ చెప్పి ఆ డైరెక్టర్ సత్తా…

కేజీఎఫ్ రూట్ లోనే సలార్ కూడా…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -