Thursday, May 2, 2024
- Advertisement -

సరికొత్త లుక్ తో సూర్య కొత్త పోస్టర్ రిలీజ్

- Advertisement -

స్టార్ హీరో సూర్య ‘సూరరై పోట్రు’ తెలుగులో ఆకాశం నీ హద్దురా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు సూర్య. ఈ నేపథ్యంలోనే పాండిరాజ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దర్శకుడు పాండిరాజ్ పుట్టినరోజు కావడంతో ఇంకొక ఇంటెన్స్ లుక్ రిలీజ్ చేశారు.


మొదటి పోస్టర్లో సూర్య తుపాకి పట్టుకుని కనిపిస్తే రెండో పోస్టర్లో మాత్రం పెద్ద కత్తి పట్టుకుని మాస్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ పోస్టర్ సహా పాండిరాజ్ ఇంకొన్ని విశేషాలను కూడ బయటపెట్టారు. ఇప్పటికి 35 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని, లాక్ డౌన్ అనంతరం షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నామని, జూలై నెలలో టైటిల్ ప్రకటన ఉంటుందని తెలిపారు.

అయితే టైటిల్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. టైటిల్ మాత్రం చాలా మాస్ గా ఉంటుందని కాస్త ఓపిక పట్టండి అన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా డైరెక్టర్ ఇలా పలు అప్డేట్స్ ఇవ్వడంతో సూర్య ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పీఆర్సీ, లాక్ డౌన్ పై కీలక నిర్ణయం!

ఒక్క అభిమాని లేకున్నా నా గుండే బద్దలవుతుంది: బాలయ్య

అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -