Sunday, May 12, 2024
- Advertisement -

‘స్పీడ్ పోస్ట్’లో అస్థికలు పంపించండి.. గంగలో కలుపుతాం.. !

- Advertisement -

మరణించిన వ్యక్తుల అస్థికలను పవిత్ర నదుల్లో కలపడం హిందూ సంప్రదాయం. కానీ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదు. కరోనా ఎఫెక్ట్​తో మరణం కూడా ఓ ప్రహసనం లా మారిపోయింది. కరోనాతో చనిపోయిన వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వారి అంత్యక్రియలకు వెళ్లేందుకు కనీస బంధువులు సైతం సాహసించడం లేదు. దీంతో ఒకరిద్దరు కుటుంబసభ్యుల మధ్యే అంత్యక్రియల తంతును సాగిస్తున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కరోనాతో మరణించిన వారి ఆస్థికలను పవిత్ర గంగా నదిలో కలిపేందుకు పోస్టల్​ శాఖ ముందుకొచ్చింది.

Also Read : తొలకరి కురిస్తే అక్కడ వజ్రాల పంట.. ఇప్పుడక్కడ బంగారు గనుల తవ్వకానికి అనుమతి..!

అస్థికలను స్పీడ్​ పోస్టులో పంపిస్తే కొన్ని స్వచ్ఛంద సంస్థల సాయంతో వార‌ణాసి, ప్ర‌యాగ్ రాజ్‌, హ‌రిద్వార్, గ‌య‌లోని గంగాన‌దిలో క‌లిపేందుకు తపాలాశాఖ ఏర్పాటు చేసింది. వారణాసికి చెందిన ఓమ్​ దివ్య దర్శన్ అనే సామాజిక సేవాసంస్థ సంయుక్తంగా స్పీడ్ పోస్ట్ విధానాన్ని ప్రారంభించింది. తపాలాశాఖ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.

ఓ వైపు దేశంలో కరోనాతో అనేక మంది చనిపోతున్నారు. ఆస్పత్రిలో వైద్యానికి లక్షలు రూపాయలు ఖర్చవుతున్నాయి. చనిపోయిన మృతదేహానికి దహనం చేసేందుకు.. మృతదేహాన్ని అంబులెన్స్​లో తీసుకెళ్లేందుకు సైతం వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ ధరకే అస్థికలను గంగలో కలిపేందుకు ముందుకు రావడం గొప్ప విషయం అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

Also Read : ఒక్క మామిడి పండు ధర రూ. 1000 .. అంత స్పెషల్​ ఏమిటీ అంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -