Thursday, May 2, 2024
- Advertisement -

దర్శకేంద్రుడి పెళ్లిసంద’D’లో అదే ప్రత్యేకత అట..!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన తీసిన చిత్రాలు ఒకప్పుడు ఓ ట్రెండ్ సృష్షాయించాయి. అలనాటి అగ్ర హీరోల నుంచి మొన్నటి వరకు యువ హీరోల వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఆయన తెరక్కించారు. ఒకప్పుడు రాఘవేంద్రరావు చిత్రంలో నటించేందుకు హీరో, హీరోయిన్లు పోటీపడేవారు. ఎంతో మంది టాప్ హీరోలు, హీరోయిన్లను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటించిన ‘పెళ్లిసందడి’ ఆయనకు ఎంతో మంచి పేరు తీసుకు వచ్చింది.

విలన్ గా చిన్న చిన్న వేషాలు వేస్తున్న శ్రీకాంత్ కి ఈ చిత్రం మంచి లైఫ్ ఇచ్చింది. శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ అందుకున్నాయి. గత కొంత కాలంగా రాఘవేంద్రరావు గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ ఆయన తన సత్తా చాటేందుకు వస్తున్నారు. పెళ్లిసంద’D’ అనే టైటిల్ తో చిత్రం తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సారి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు.

ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నారు.. కొత్త హీరోయిన్ ని వెండి తెరకు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇంగ్లీష్ లెటర్ ‘డీ ‘ పెట్టడానికి కారణం ఉందట. సినిమాలో డీ అక్షరానికి చాలా ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. ‘డీ’ అనే అక్షరం చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని టాలీవుడ్ టాక్. పెళ్లి సందడికి అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. 

ప్రభాస్ కి హీరోయిన్ దొరకడం లేదట..!

ఆదిపురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా…?

సమ్మర్ కే తొడ కొడతానంటున్న బాలయ్య బాబు..!

రాధే శ్యామ్ లో ఇంకో హీరోయిన్ ఉందా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -