Friday, April 26, 2024
- Advertisement -

’ఫైటర్’ ఇంకా రెడీ అవ్వలేదా..?

- Advertisement -

విజయ్ దేవరకొండ ఈ పేరు వినగానే అర్జున్ రెడ్డి సినిమా తప్పక గుర్తొస్తుంది ఎందుకంటే ట్రెండ్ సెట్ చేసే సినిమా ఇది. విజయ్ చేసిన యాక్టింగ్ సినిమా కంటెంట్ ఒకరితో ఒకరు పోటీ పడేలా ఉన్నాయి కాబట్టే ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుది. వల్గారిటీ ఎక్కువ అయిన ఇప్పటి జెనరేషన్ కి అది చాలా తక్కువ. విజయ్ ఇప్పటివరకు అన్ని సినిమాలు చేసినా అర్జున్ రెడ్డి ప్రభావం ఆయనమీద ఇంకా పోలేదని చెప్పాలి. .. హిందీలో ఆ సినిమా తీస్తే అక్కడ నటించిన హీరో కంటే విజయ్ ఎక్కువ ఫేమస్ అయ్యాడు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోల బెర్త్ కి ఎసరుపెడుతున్నాడు.

అయితే ఈ రౌడీ హీరో అర్జున్ రెడ్డి ఫీవర్ నుండీ ఇంకా బయటకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడు ఇక పై లవ్ స్టోరీలు చెయ్యను అని చెప్పాడు. ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కాని ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ’ఫైటర్’ వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్యున్నాడు విజయ్ దేవరకొండ.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ఫామ్ లో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఎక్కువ అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలిసి ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు పూరి, ఛార్మీ. లాక్ డౌన్ టైంలో షూటింగ్ ఆగిపోయిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం షూటింగ్లకు అనుమతులు ఇవ్వడంతో.. అన్ని సినిమాల షూటింగ్లు మొదలయ్యాయి. సినిమాని ఫాస్ట్ గా తెరకెక్కించడంలో పూరి జగన్నాథ్ ఎప్పుడు ముందుంటాడు, ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తుంటాడు విజయ్. కానీ ‘ఫైటర్’ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్టు ఎటువంటి చప్పుడు లేదు. మరీ వీరిద్దరూ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు..! అంటు సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి.

సైడ్ క్యారెక్టర్స్ నేను చేయలేను : హీరో తరుణ్

ఓటీటీ లో పూరి కొడుకు రొమాంటిక్..!

కాస్టింగ్ కౌచ్ పై వర్షిణి షాకింగ్ కామెంట్స్..!

’కలర్ ఫోటో’ సినిమాకోసం సునీల్ ఎంత తీసుకున్నాడంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -