ఆదిపురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా…?

- Advertisement -

సాహో ఫ్లాప్ వల్ల ప్రభాస్ రాదే శ్యాం పై ప్రత్యేక ద్రుష్టి పెడుతున్నాడు.. ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా కి సంబంధించి స్క్రిప్ట్ ని మార్పించి మరీ సినిమా ని రీ షూట్ చేయిస్తున్నాడు ప్రభాస్.. అందుకే సినిమా ఇంత ఆలస్యమవుతూ వచ్చింది.. రాధే శ్యామ్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని అంటున్నారు. అయితే సాహో వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడం కొంత ఆందోళనకు గురిచేస్తుంది. ఒకరకంగా డైరెక్టర్ రాధాకృష్ణ పై ఫాన్స్ కొంత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది.. ప్రభాస్ లాంటి స్టార్ హీరో తో బాహుబలి తీసినట్లు ఇలా సంవత్సరాలకు సంవత్సరాలు సినిమా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని సోషల్ మీడియా లో విమర్శలు చేస్తున్నారు..  

ఇక ప్రభాస్ ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమా లు చేయనున్నాడు ప్రభాస్..  రాదే శ్యాం తర్వాత వెంటనే ప్రభాస్ నాగ్ అశ్విన్  సినిమా చేస్తున్నాడు.. ఆ తర్వాత ఆది పురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..  భారీ బడ్జెట్ తో , భారీ కథ తో వస్తున్న సినిమా  కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.  తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు..

- Advertisement -

ఇక ఈ సినిమా లో సగం బడ్జెట్ రెమ్యూనరేషన్స్ కే కేటాయిస్తున్నారట.. పాన్ ఇంటర్నేషనల్ లెవల్లో రానున్న సినిమా కావడంతో ఇతర ఇండస్ట్రీల నుంచి స్టార్స్ ని తీసుకోనున్నారని తెలుస్తోంది. అన్ని భాషల వారినీ ఆకట్టుకోవాలి కాబట్టి ఆయా భాషలకు చెందిన స్టార్స్ కు చోటు కల్పించాలనుకుంటున్నారట. అలానే హాలీవుడ్ చిత్రాలకు పనిచేసే సాంకేతిక నిపుణులను కూడా తీసుకురానున్నారట. దాదాపు రూ.250 – 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేసుకున్నారట. సో మరి వీరి ఎంపిక సినిమా హిట్ కి ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి..

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా ?

రాధే శ్యామ్ కి మ్యూజిక్ కొట్టెది ఎవ్వరు..?

రాధే శ్యామ్ లో ఇంకో హీరోయిన్ ఉందా…?

ప్రభాస్ మూవీకోసం అమితాబ్ కి ఎంత ఇస్తున్నారో తెలుసా ?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News