Friday, March 29, 2024
- Advertisement -

జ‌క్క‌న్నా.. మ‌జాకా.. విడుద‌ల‌కు ముందే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల మోత !

- Advertisement -

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా అంత‌ర్జాతీయంగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళీ. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ప్ర‌తి సినిమా ఓ సంచ‌ల‌న‌మే. మగ‌ధీర‌, బ‌హుబ‌లి వంటి సినిమాల‌తో భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌ను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు జ‌క్క‌న్న. బ‌హుబ‌లి సినిమా అయితే బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.

ప్ర‌స్తుతం జ‌క్క‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా “ఆర్ ఆర్ ఆర్”. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌లు క‌థ‌నాయ‌కులుగా న‌టిస్తున్నారు. దాదాపు 450 కోట్ల రూపాయ‌ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్ట‌ర్ తో అంచ‌నాల‌కు అనుగుణంగానే విడుద‌ల‌కు ముందే భారీ బిజినెస్‌తో దూసుకుపోతోంది.

త‌మిళ‌నాడులో ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లికింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కుల కోసం త‌మిళ అగ్ర నిర్మాణ సంస్థ‌లు తెగ పోటీ పడ్డాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. త‌మిళ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ రూ.42 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ద‌ని సిని వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో బ‌హుబ‌లి-1 థియేట్రిక‌ల్ హ‌క్క‌లు రూ.47 కోట్ల‌ను బ్రేక్ చేసింది. కాగా, ఈ సినిమా అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్.. ‘వేశ్య’గా యాంకర్‌ అనసూయ!

పిచ్చెక్కిస్తున్న రొమాంటిక్ సీన్స్!

నాందిలో న‌రేష్ న‌ట విశ్వ‌రూపం..!

హైదరాబాద్ లో అల్లు అర్జున్ ’పుష్ప’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -