Friday, April 26, 2024
- Advertisement -

హీరో అబ్బాస్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

- Advertisement -

ఒకప్పటి యూత్ ఐకాన్ హీరో అబ్బాస్ తమిళంలో “కాదల్ దేశం” సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా అద్భుత విజయం సాధించడంతో తెలుగులో “ప్రేమ దేశం”, హిందీలో ఈ సినిమాని “దునియా దిల్” పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా విడుదలైన
అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ గా నిలిచి అద్భుతమైన కలెక్షన్లు రావడంతో హీరో అబ్బాస్ కు వరుస సినిమాల్లో అవకాశం దక్కింది.

తొలి సినిమాతోనే అత్యధిక అభిమానులను సొంతం చేసుకున్న అబ్బాస్ తెలుగులో”ప్రియా ఓ ప్రియా ” సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు పది సినిమాల్లో నటించారు. హీరో అబ్బాస్ కెరీర్ దాదాపు ఆఫ్ సెంచరీ సినిమాల్లో నటించాడు. 20 సంవత్సరాలకే హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అబ్బాస్ అంతే త్వరగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు.

Also read:ఆ దర్శకుడి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కర్ణన్ రీమేక్?

హీరో అబ్బాస్ దాదాపు ఆరేళ్లుగా వెండితెరపై కనిపించడం లేదనే చెప్పాలి.ప్రస్తుతం అబ్బాస్ ఎక్కడ ఉన్నాడు,ఏం చేస్తున్నాడనేది ఆప్తులకు మాత్రమే తెలుసు.అయితే ఇటీవలే సోషల్ మీడియాలో హీరో అబ్బాస్ తన కెరీర్ కు సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.ప్రస్తుతం అబ్బాస్ కుటుంబంతో సహా న్యూజిలాండ్ లో నివసిస్తున్నారు. అక్కడ మోటివేషనల్ స్పీకర్‌గా వ్యవహరిస్తు చాలామందిలో నిరుత్సాహాన్ని తొలగించి ధైర్యాన్ని నింపుతున్నాడు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం జరుగుతోంది.

Also read:ప్రేయసి కోసం రూ.23 కోట్ల విలువచేసే విల్లా కొన్న స్టార్ హీరో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -