నా కోసం మా అమ్మవాళ్ళు బెంగ పెట్టుకున్నారంటున్న స్వీట్ హీరోయిన్!

- Advertisement -

ప్రస్తుతం భారతదేశంలో రెండవ దశ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. భారత దేశంలో ఏర్పడిన పరిస్థితులను చూస్తే ఇతర దేశాలలో ఉన్న భారతీయ ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది తమ వారిని తమ దగ్గరకు రావాలని తమ బంధువులకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండజ్‌ కు ఇలాంటి సంఘటన ఎదురయ్యింది.

ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్నాండజ్‌ ఇండియాలో నివసిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు మాత్రం బహ్రెయిన్‌లో నివసిస్తున్నారు.ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థితులను చూసిన ఆమె తల్లిదండ్రులు ఎంతో బెంగ పెట్టుకొని తనని కూడా వారి దగ్గరకు వచ్చేయమని సూచించినట్లు తెలిసింది. అదే విధంగా శ్రీలంకలో నివసించే తన స్నేహితులు తన బంధువులు సైతం వారి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -

Also read:ప్రేయసి కోసం రూ.23 కోట్ల విలువచేసే విల్లా కొన్న స్టార్ హీరో?

ఈ క్రమంలోనే జాక్వెలిన్ మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా ఇండియాలోనే ఉంటూ తన పనులు తాను చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితులలో నాకు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఉంది. కానీ ఈ పరిస్థితులలో కనీస అవసరాలు తీర్చుకోలేని వారు ఎందరో ఉన్నారు అలాంటివారికి తన వంతు సహాయంగా యేలో (యు ఓన్లీ లివ్‌ వన్స్) ఫౌండేషన్‌ ద్వారా కొవిడ్‌ బాధితుల కోసం ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ “భూత్‌ పోలీస్‌”, ‘సర్కస్‌’, అక్షయ్‌ కుమార్‌తో కలిసి  ‘బచ్చన్‌ పాండే’, ‘రామ్‌సేతు’ వంటి సినిమాలలో నటిస్తున్నారు.

Also read:ఆ వివాదం పై సమంత స్పందించక పోవడానికి కారణం అదే!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -