Thursday, May 2, 2024
- Advertisement -

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం.. 52 మంది మృతి

- Advertisement -

తెలంగాణలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గడిచిన ఒక్కరోజులో తెలంగాణలో కొత్తగా 10,122 మంది కరోనా బారినపడినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం ఉదయం మీడియాకు తెలిపారు. నిన్న ఒక్కరోజే 52 మంది మృతి ప్రాణాలను కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బలెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కు చేరిందని, ఇందులో 3,40,590 మంది కరోనా నుంచి కోలుకోగా,, 2094 మంది చనిపోయారని వారు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 69,221 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, సోమవారం నాడు 99,638 మందికి కరోనా పరీక్షలు చేశామని అధికారులు వివరించారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా కరోనా బారినపడి 2,094 మంది ప్రాణాలొదిలారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,440మంది కరోనా బారిన పడ్డారు.

ఇక, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 751, రంగారెడ్డిలో 621, వరంగల్‌ అర్బన్‌లో 653, నిజామాబాద్‌లో 498, నల్లగొండలో 469, ఖమ్మంలో 424, మహబూబ్‌నగర్‌లో 417, కరీంనగర్‌ జిల్లాలో 369 చొప్పున నమోదయ్యాయి. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు తేల్చిచెప్పారు. అత్యవసర పనులు ఉంటేనే రోడ్ల మీదకు రావాలని, రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని వారు ప్రజలను కోరారు.

కరోనాతో నటి మాలాశ్రీ భర్త కన్నుమూత

చేతి నరాలు కట్ చేసుకొని మాలీవుడ్ నటుడు ఆత్మహత్యాయత్నం!

డేవిడ్ వార్నర్ పై నటి ఈషా రెబ్బా ఫన్నీ కామెంట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -