Thursday, April 25, 2024
- Advertisement -

బాలయ్య సరసన ఎఫ్3 ముద్దుగుమ్మ.. ఎవరంటే?

- Advertisement -

ఈ ఏడాది ఆరంభంలోనే గోపీచంద్ మలినేని “క్రాక్ ” మూవీతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తదుపరి సినిమా కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న సందర్భంలో టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తో సినిమా ఫిక్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గోపీచంద్ మలినేని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించాడు.

బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న బాలకృష్ణ 107 వ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ బ్యానర్ పై తెరకెక్కనుంది.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా “ఎఫ్3 ” బ్యూటీ మెహ్రీన్ నటిస్తోందని తెలుస్తోంది. నిజానికి ఈ ఏడాది మెహ్రీన్ పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెబుదామని నిర్ణయించుకుంది. కానీ అనుకోని కారణాల వల్ల మెహ్రీన్ పెళ్లి వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో బాలకృష్ణ సరసన నటించడానికి సిద్ధమైంది.

Also read:ఏడాదిలో రూ.150 కోట్లు వదులుకున్న ప్రభాస్..?

నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “అఖండ”. ఈ మూవీ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్ సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయగా తాజాగా వీరి కాంబినేషన్లో వస్తున్న “అఖండ” మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Also read:పాపం.. ఆ నటుడుకి డైరెక్టర్ వంశి జీవితంపై విరక్తి కలిగించాడట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -