Wednesday, April 24, 2024
- Advertisement -

లాక్ డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!

- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ నాలుగు లక్షల కేసులు.. నాలుగు వేలకు పైగా మరణాలు సంబవించాయి. దాంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు పరిచాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా మహారాష్ట్రపై చూపించింది. కరోనా సెకండ్ వేవ్‌ నుంచి ఆ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇటీవలే కఠిన లాక్‌డౌన్‌ నుంచి ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది.

మొన్నటి వరకు ఇంటికే పరిమితమైన ప్రజలు ఇప్పుడు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. మార్కెట్లు రద్దీగా కనిపిస్తున్నాయి. దీంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడో వేవ్‌ తప్పదని.. అంచనాల కంటే ముందే మహమ్మారి మహారాష్ట్రను కుదిపేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. గత రెండు రోజులుగా రోజువారీ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. సోమవారం 6,270 కేసులు వెలుగులోకి రాగా.. మంగళవారానికి అవి 8,470కి పెరిగాయి.

నేడు అవి 10,066కి ఎగబాకాయి. దీంతో మరోసారి రాష్ట్ర యంత్రాంగంలో ఆందోళన మొదలైంది. బహిరంగ ప్రదేశాల్లో రద్దీ పెరిగి కేసులు భారీ స్థాయిలో విజృంభించే అవకాశం ఉందని సీఎం ఉద్ధవ్‌ థాకరే నేతృత్వంలోని కమిటీ ఇటీవలే హెచ్చరించింది. ఒక్క మహారాష్ట్రకే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే కరోనా కేసులు మళ్లీ పెరిగిపోయి మరింత కష్టాల్లోకి లాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ విజేతగా న్యూజిలాండ్

నేటి పంచాంగం,గురువారం(24-06-2021)

బెల్లంకొండ గణేశ్​ హీరోగా మరో సినిమా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -