Monday, May 13, 2024
- Advertisement -

గౌతమీ పుత్ర శాతకర్ణి మొదటి రివ్యూ!

- Advertisement -
gautamiputra satakarni movie first review

నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన బాలయ్య వందో సినిమా టీజర్, ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబ్ కూడా రికార్డ్ సృష్టిస్తోంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని డైరక్టర్ క్రిష్ తన స్నేహితులు, డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించారట. వారు నుంచి ఈ సినిమాకి సంబంధించిన సంగతలు బయటకు వచ్చాయి.. వారు చెప్పిన ప్రకారం.. గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ రివ్యూ..

గౌతమి పుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. భరత్ పై యుద్ధాలు జరగకూడదని.. శాంతి ప్రజ్వలిల్లాలని  సంకల్పించిన తెలుగు చక్రవర్తి లక్ష్యాన్ని చేరుకునే వైనాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. ఈ సినిమా ద్వారం మనం ఒకటవ శతాబ్దానికి వెళ్తాం. ఈ చిత్రంలో బాలకృష్ణ రాజసం, యుద్ధ విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. బాలయ్య చెప్పే డైలాగులు అదిరిపోయాయి. చిరంతన్ భట్ సాంప్రదాయ వాయిద్యాలతో సమకూర్చిన పాటలు వినేందుకు యావరేజ్ ఉన్నప్పటికీ తెరపైన కనులవిందుగా ఉంది. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ కథను చెప్పే విధానం బాగుంది.

శాతకర్ణి తల్లిగా బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని నటించడం విశేషం. కొన్ని సీన్స్ లో శాతకర్ణి భార్య వశిష్టా దేవిగా శ్రీయా నటించిన విధనం అమోఘం. ఈ పాత్రతో ఆమెకు మంచి నటిగా పేరు తీసుకొస్తుంది. చాలా తక్కువ టైంలో ఇంత గొప్ప సినిమా ఎలా తీసారు అనేది చాలా మందిలో కలిగే మొదటి ప్రశ్న. విజువల్ ఎఫెక్ట్స్, రీరికార్డింగ్ పూర్తికాకముందే మెస్మరైజ్ చేస్తుంటే థియేటర్లో ఇంకెంతగా ఆకట్టుకోనుందోనని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ చిత్రం రేపు సెన్సార్ కు వెళ్తుంది. జనవరి 12 రిలీజ్ కాబోతుంది. 

Related

  1. బాల‌య్య‌పై.. షాకింగ్ కామెంట్స్ చేసిన చరణ్!
  2. చిరు, బాలయ్య మధ్య గొడవ.. ఎందుకోసం..?
  3. బాలయ్యపై బన్నీ షాకింగ్ కామెంట్స్.. ఫైర్ అయిన అభిమానులు!
  4. బాలయ్య, ఎన్టీఆర్ మధ్య మరోసారి గొడవలు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -