Saturday, May 18, 2024
- Advertisement -

ఖైదీ నంబర్ 150 మూవీ మొదటి రివ్యూ!

- Advertisement -
khaidi no 150 movie first review

దర్శకుడు వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 సినిమా అన్ని హంగులు పూర్తిచేసుకొని రిలీజ్‍కు రెడీ అయ్యింది. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరు నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై మొదటినుంచి అంచనాలు బానే ఉన్నాయి.

అంతేకాదు హీరోగా 150 చిత్రం కావడం వల్ల చిరు తనయుడు నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. గత వారం సెన్సార్ ముందుకు వెళ్లిన ఈ సినిమా ఎటువంటి కట్స్ లేకుండా యూఏ సర్టిఫికెట్ అందుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు ఈ సినిమాని చూసారు. వారు చెప్పిన దాని ప్రకారం ఖైదీ నంబర్ 150 మూవీ ఫస్ట్ రివ్యూ … 

చిరు భారీ ఫైట్ తో ఎంట్రీ ఇస్తారు. దారుణంగా రైతుల భూములు లాక్కునే వారిపై విరుచుకు పడుతుంటారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం కామెడీ, కొంచెం యాక్షన్‍తో సాగుతోంది. ఇంట్రవెల్ బ్యాంగ్ పెద్ద పైట్ తో పాటు సూపర్ ట్విస్ట్ ఉంటుంది. చిరు డ్యూయల్ రోల్ చేశారనే సంగతి ప్రేక్షకుడికి ఇక్కడ తెలుస్తుంది. ఇంట్రెవెల్ తర్వాత ఒక చిరంజీవిని పోలీసులు జైలులో బంధిస్తే మరో చిరంజీవిని విలన్ ముప్పుతిప్పలు పెడుతుంటాడు. స్థలం కోసం వృద్దాశ్రమాన్ని కూడా విలన్ సొంతం చేసుకోవాలని అక్కడ నివసించే ముసలివారిని హింసిస్తాడు. ఇలా రైతులు, వృద్ధులను కష్టపెట్టిస్తున్న దుర్మార్గుడికి ఇద్దరు హీరోలు ఎలా బుద్ధి చెబుతారనేది? కథ.

తమిళ సినిమా కత్తికి ఇది రీమేక్ అయినప్పటికి ఫ్రెష్ లుక్ కోసం చాలా సీన్స్ వివి వినాయక్ కొత్తగా రాసుకున్నట్లు తెలుస్తోంది. తమిళ కత్తిలో ఉన్న కాయిన్ ఫైట్ కి చిరు స్టైల్ ని జోడించి ఆ ఫైట్ కి మంచి క్రేజ్ తీసుకొచ్చారు. రాయ్ లక్ష్మి ఐటెం సాంగ్ అద్భుతంగా ఉంటుందట. బ్రహ్మానందం కాసేపు కనిపించినా నవ్వించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్రకు తగ్గ న్యాయం చేసింది. యాక్షన్ సీన్స్ నుంచి మంచి రిలీఫ్ నిస్తాయి. పాటలు చాలా బాగా వచ్చాయట. భారీ ఫైట్లు, హుషారెత్తించే డ్యాన్స్ లు, సరదా సన్నివేశాలతో ఖైదీ నంబర్ 150 మూవీ సాగిపోతుందని, ఈ చిత్రం మెగాస్టార్ మాస్ అభిమానులకు చాలా బాగా నచ్చుతుందని సినీ ప్రముఖులు అంటున్నారు.

Related

  1. ఖైదీ నంబర్ 150 ఎంత మంది హీరోయిన్స్ ఉన్నారంటే..?
  2. ఖైదీ నెం.150 గురించి చిరు షాకింగ్ కామెంట్స్!
  3. ఖైదీనెం.150 కాపీ కొట్టి అడ్డంగా దొరికిన దేవిశ్రీ
  4. లీకైన ‘ఖైదీ నెం.150’ మూవీ సాంగ్.. డాన్స్ తో అదరగొట్టిన చిరు, కాజల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -