Thursday, May 16, 2024
- Advertisement -

పోర్న్‌ వీడియోలు తీసి అడ్డంగా బుక్కైన హీరోయిన్

- Advertisement -

సినిమాల్లో నటించాలనే ఆశతో ముంబైకు వచ్చే వారిలో కొందరు ఆ కల నెరవేరకపోవడంతో తప్పుదోవలో ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. తాజాగా.. ముంబైలో ఈ తరహా ఘటనే ఒకటి వెలుగుచూసింది. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి ఆ తర్వాత టెలివిజన్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి గెహనా వశిష్ట నీలి చిత్రాల్లో నటిస్తూ.. ఆ వీడియోలను తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు తేలడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. గెహనాతో పాటు మరికొంత మంది మోడల్స్, చిన్న చిన్న నటీమణులు, కొన్ని నిర్మాణ సంస్థల ప్రమేయం ఈ పోర్న్ వీడియో రాకెట్‌లో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పోర్న్ వీడియోలను మొబైల్ యాప్స్, వెబ్‌సైట్‌లలో మరికొందరు అప్‌లోడ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గెహనా వశిష్టకు సంబంధించిన సుమారు 87 నీలి చిత్రాలు ఆ వెబ్‌సైట్‌లో ఉన్నాయని, వాటిని చూసేందుకు వీక్షకుల నుంచి రూ. 2000 ఫీజు వసూలు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఆమెను, ఆమెతో నీలి చిత్రాలను నిర్మిస్తున్నవారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

శ్రీకాంత్, పోసాని కృష్ణమురళి కాంబినేషన్‌లో వచ్చిన హిట్ మూవీ ‘ఆపరేషన్ దుర్యోధన’తో గెహన వశిష్ట టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందరి దృష్టి ఆకర్షించింది. ఆ తర్వాత ‘అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి’, ‘నమస్తే’, ‘బి.టెక్‌ లవ్‌ స్టోరీ’, ‘ఐదు’ వంటి చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితమైన గెహనాకు, అక్కడా అవకాశాలు అంతంత మాత్రంగానే వరించాయి. దీంతో హాట్‌ హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాని వేడెక్కించినా ఫలితం లేకుండా పోయింది. ఇంక చేసేది లేక నీలి చిత్రాలను నమ్ముకుంది. నీలి చిత్రాల్లో నటిస్తూ.. ఆ వీడియోలను ఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి.. సబ్‌స్ర్కిప్షన్‌ ఫీజు కింద రూ. 2000 వసూలు చేస్తున్న గెహనా వశిష్ట అండ్‌ టీమ్‌ను తాజాగా ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.పోర్న్ సినిమాల్లో తమను బలవంతంగా నటింపజేస్తున్నారని ముగ్గురు బాధితులు తమను ఆశ్రయించడంతో ఈ రాకెట్ బయటపడిందని ముంబై పోలీసులు వెల్లడించారు.

ఎంపీ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం..‌!

సోహెల్ తో అరియానా మళ్ళీ రెచ్చిపోయిందిగా…!

శృంగార నటి సన్నీలియోన్ పై అక్కడ చీటింగ్ కేసు.. కారణం అదేనా?

అబ్బ‌.. సూప‌ర్ క్యాచ్.. ఒంటి చేత్తో..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -