Monday, April 29, 2024
- Advertisement -

సోహెల్ తో అరియానా మళ్ళీ రెచ్చిపోయిందిగా…!

- Advertisement -

బిగ్‌బాస్ సీజన్ 4 ఎంతబాగా హిట్ అయ్యిందో అందరికి తెలుసు.అలకలు, గొడవలు, కొట్లాటలు, నవ్వులు, ఇంకా కష్టతరమైన టాస్కులతో అనుక్షణం సరదాగా, ఆసక్తికరంగా సాగేది.9 అయితే చాలు ప్రేక్షకులు టీవిలకు అతుక్కుపోయేవారు బిగ్ బాస్ షో కోసం. ఇక బిగ్ బాస్ 4 లో అందరూ మెచ్చే హౌస్ మేట్ లలో అరియానా కూడా ఒక హౌస్ మేట్. లేడీ ఆటమ్ బాంబ్ గా పేరు సాధించింది అరియానా..ఇక బిగ్ బాస్ హౌస్ లో అరియానా, ఇస్మార్ట్ సోహైల్ మధ్య జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఓ దశలో ఇద్దరి మద్య గొడవ తారా స్థాయికి చేరింది. బిగ్‌బాస్ హౌస్ మైకులు పగిలిపోయే స్థాయిలో ఇద్దరి మధ్య పతాక స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. అదే తనని ఫైనల్ నుంచి నిష్క్రమించేలా చేస్తుందని ఆ తరువాత సోహైల్ భయపడి బిగ్‌బాస్ ముందు క్షమాపణలు కూడా చెప్పాడు.

ఒక్కోసారి వీరిద్దరి మధ్యలో గొడవలు తగ్గి స్నేహం పెరిగింది అనుకున్నా ఆ తరువాత కూడా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.అయినా కాని వీరు ఎప్పుడూ మంచి ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళు. తాజాగా ఈ ఇద్దరు కలిసి బిగ్‌బాస్ ఉత్సవంలో మళ్లీ రచ్చ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆదివారం బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లతో బిగ్‌బాస్‌ ఉత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.

ఇందుకు సంబంధించిన ప్రొమో గత మూడు నాలుగు రోజులుగా యు ట్యూబ్ లో ఒక రేంజ్ లో సందడి చేస్తూ ఆకట్టుకుంటుంది.ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో చూసినట్లయితే అరియానా ఎక్కడెక్కడో సోహైల్‌పై చేతులేస్తూ రచ్చ చేసింది. శ్రీముఖి పక్కనుండగానే తన హృదయంపై అరియానా చేతులేసి మృదువుగా తాకడంతో సోహైల్‌కు ఏదేదో అయిపోయి ఒంట్లో కరెంట్ పాసైపోయింది.

దీంతో ఏదో జరిగేలా వుందని భావించిన సోహైల్ అరేయ్ మెహబూబ్‌.. అఖిల్.. అంటూ కేకలు వేశాడు. దీంతో శ్రీముఖి అందుకుని అరియాన చేయివేస్తే `మెహబూబ్‌.. అఖిల్.. ఏంటయ్యా.. అంటూ సోహైల్ పై కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

హాట్ హాట్ గా ‘పిట్ట కథలు’ ట్రైలర్ అలరిస్తోంది..!

ఏకగ్రీవాలపై ఎస్ఈసీ మరో సారి ఆగ్రహం..!

డైరెక్టర్ గా మారబోతున్న కెమెరామెన్ విద్యాసాగర్…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -