కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. తమిళనాడు లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ధనుష్ కు మంచి వైఫ్ గా ఉంటానని అంటుంది హీరోయిన్ అమలాపాల్.
తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ రెండేళ్లు గడవక ముందే విజయ్ నుంచి తెగతెంపులు చేసుకుని.. మళ్లీ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం చేతినిండా వరస సినిమాలతో బిజీగా ఉన్న అమలాపాల్ ప్రస్తుతం ధనుష్ తో వీఐపీ 2 లోనూ నటిస్తోంది. గతంలో వచ్చిన వీఐపీ- తెలుగులో రఘువరన్ బీటెక్ మూవీలో వీళ్లిద్దరి కెమెస్ట్రీ అద్భుతంగా పండటంతో రెండో భాగానికి కూడా అమలానే ఎంపికచేసుకున్నారు.
{loadmodule mod_custom,GA1}
వీఐపీ-1లో హీరో ధనుష్‌ని ఆటపట్టించి, ఏడిపించే ప్రియురాలిగా నటించిన అమలా.. వీఐపీ-2లో హీరో భార్యగా చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘వీఐపీ-1లో నా పాత్రను చంపేయనందుకు థ్యాంక్స్. వీఐపీ-2లో సతాయించే భార్యగా నటిస్తున్నా. ఫస్ట్ పార్ట్‌లో ప్రియురాలిగా, సెకండ్ పార్ట్‌లో హింసించే అర్ధాంగిగా చేసిన నాకు వీఐపీ-3లోనూ ఛాన్స్ ఇస్తే మంచి భార్యగా ఉంటా’ అని చమత్కరించింది అమలాపాల్. ఇక ధనుష్ కు, అమలాపాల్ కు మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందంటూ గతంలో గాసిప్స్ వచ్చిన విషయం తెలిసిందే.
{youtube}G90cPSdtMp8{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related