Wednesday, May 1, 2024
- Advertisement -

చలపతి, యాంకర్ రవి లపై సీరియస్ అయిన అమల

- Advertisement -
Akkineni Amala Serious over Chalapathi Rao Remarks

సీనియర్ నటుడు చలపతి రావు ఆడవారిపై చేసిన కామెంట్స్ ఎలాంటి దుమారం రేపాయో తెలిసిందే. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో చలపతి రావు ఈ వ్యాఖ్యలు చేయగా.. ఈ సినిమాకు నిర్మాత అయిన నాగార్జున ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్విట్టర్ వేదికగా ఆ వ్యాఖ్యల్ని ఖండించాడు.

అలానే నాగచైతన్య సైతం వెంటనే స్పందిస్తూ.. చలపతి వ్యాఖ్యల్ని తప్పుబట్టాడు. ‘రారండోయ్..’ హీరోయిన్ రకుల్ ప్రీత్ సైతం కొంచెం గట్టిగానే స్పందించింది. ఐతే వీళ్లందరూ అంత వేగంగా రెస్పాండవ్వడానికి.. చలపతిరావు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడానికి కారణం నాగార్జున సతీమణి అమలేనని సమాచారం. ఆమె చలపతి చేసిన వ్యాఖ్యలపై చాలా సీరియస్ అయ్యిందంట. తమ సంస్థలో వస్తున్న సినిమా వేడుకలో ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి అని ఆమె మండి పడ్డారట. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆమె.. నాగార్జునతో పాటు చైతూ.. రకుల్ లతోనూ మాట్లాడి వెంటనే ఖండనలు ఇచ్చేలా చూసిందట. అమల చూడటానికి సాప్ట్ గా కనిపించిన కొన్ని విషయాల్లో ఆమె చాలా కఠినంగా ఉంటారు.

{loadmodule mod_custom,Side Ad 1}

గతంలో ఒక వేడుక సందర్భంగా ఓ వ్యక్తి ‘అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు’ అని వ్యాఖ్యానించడంపై ఆమె సీరియస్ అయ్యారు. ‘నేను అబద్ధాలు ఆడతాను. ఆడపిల్లలు పుడతారా’ అంటూ ఆ వ్యక్తిని వేదిక మీదే నిలదీశారు. మరో వేడుకలో ఎవరో హీరో నక్క తోక తొక్కి హీరో అయ్యాడు అని యాంకర్ వ్యాఖ్యానించగా.. దాని మీదా ఆమె అలాగే స్పందించారు. జంతు ప్రేమికురాలైన ఆమె నక్క తోకే కాదు.. కుక్క తోక కూడా తొక్కకూడదని.. అసలు ఏ జంతువునూ ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. తామేదో మాట వరసకు అన్నామన్నా వినని అమల.. ఆ యాంకర్ తో వేదిక మీదే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పించడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆమె చలపతి రావు అన్న కామెంట్స్ కు, చలపతి చేసిన కామెంట్ కి యాంకర్ రవి సూపర్ అనడం పై అమల చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

{youtube}BWS6mds8_jo{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. స్మిత సబర్వాల్ కి రచ్చ రవికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?
  2. పళ్లు రాలిపోయేలా కొట్టాలి.. రవిపై లాస్యకు ఇంత కోపం ఉందా..?
  3. చలపతి విషయంలో.. రవికి షాక్ ఇచ్చిన శ్రీముఖి..
  4. నోరు అదుపులో పెట్టుకో.. రవికి నాగార్జున వార్నింగ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -