Thursday, April 25, 2024
- Advertisement -

గోపీచంద్ బర్త్ డే స్పెషల్ : ‘పక్కా కమర్షియల్’ పోస్టర్ రిలీజ్

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో విలన్ గా కెరీర్ ఆరంభించి హీరోగా మారిన గోపిచంద్ వరుస విజయాలతో దూసుకు వెళ్లాడు. యాక్షన్ హీరోగా తనదైన మార్క్ చాటుకున్నాడు గోపిచంద్. లౌక్యం చిత్రం తర్వాత ఈ యాక్షన్ హీరోకి ఒక్క సక్సెస్ కూడా కలిసి రాలేదు. ‘సీటీమార్’ తరువాత గోపీచంద్ చేస్తున్న మూవీ పక్కా కమర్షియల్’ .

మారుతి – గోపీచంద్ కాంబినేషన్లో ‘పక్కా కమర్షియల్’ తెరకెక్కుతుంది. యూవీ క్రియేషన్స్ .. గీతా ఆర్ట్స్ 2 వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడిన విషయం తెలిసిందే. రేపు గోపీచంద్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ శుభాకాంక్షలు అందజేస్తూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

క్యూట్ బేబీస్ తో స్టైలిష్ లుక్ తో మంచి జోష్ తో స్టెప్పులు వేస్తున్నట్టు ఈ పోస్టర్ చాలా స్పెషల్ గా ఉంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా కనిపించనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జిల్’ భారీ విజయాన్ని అందుకుంది. కొంతకాలంగా గోపీచంద్ సరైన హిట్ లేకుండా ఉన్నాడు. ఈ సినిమాతో తన నిరీక్షణ ఫలిస్తుందని ఆయన భావిస్తున్నాడు.

థర్డ్​వేవ్​.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్​ఫుల్​..!

బన్నీతో కలసి మెగాస్టార్ తీన్ మార్ స్టెప్పులు.. ఫ్యాన్స్ కిక పండగే..!

పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -