విడుదలకు ముందే పుష్ప రికార్డుల హోరు..!

ఇంటెలిజెంట్​ డైరెక్టర్​ సుకుమార్​ డైరెక్షన్​లో వస్తున్న పుష్ఫ పాన్​ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్​, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. కాగా పుష్ప సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం రికార్డుల మోత మోగిస్తున్నది. యూట్యూబ్ లో విడుదలైన టీజర్​ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నది.

యూట్యూబ్ లో ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న కేజీఎఫ్​ చాప్టర్​ -2 191 మిలియన్​ వ్యూస్​తో టాప్​లో ఉండగా.. పుష్ప సెకండ్​ ప్లేస్​కు చేరుకుని రికార్డ్ సృష్టించింది. పుష్ప టీజర్​ 72.44 మిలియన్ వ్యూస్ దక్కించుకొని రెండో స్థానంలో నిలిచింది. శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన భారీ స్కై ఫై థ్రిల్లర్ రోబో “2.0” టీజర్ 72.44 మిలియన్ వ్యూస్ తో రెండో ప్లేస్ లో ఉండగా.. పుష్ప దాన్ని తాజాగా దాటేసింది. దీంతో అల్లు అర్జున్​ ఫ్యాన్స్​ పండగ చేసుకుంటున్నారు.

Also Read: బన్నీతో కలసి మెగాస్టార్ తీన్ మార్ స్టెప్పులు.. ఫ్యాన్స్ కిక పండగే..!

ఎర్ర చందనం స్మగ్లింగ్​ చేసే లారీ డ్రైవర్ పుష్ప రాజు గా అల్లు అర్జున్ నటిస్తున్నాడు. అల్లు అర్జున్​ తొలిసారిగా మాస్​లుక్​లో అలరించబోతున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నా గిరిజన యువతి పాత్రను పోషిస్తున్నది. అల్లు అర్జున్​ తొలిసారిగా పాన్​ ఇండియా మూవీలో నటిస్తుండటంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Also Read: సీక్వెల్.. ఇప్పుడిదే సక్సెస్​ ఫార్ములా?

Related Articles

Most Populer

Recent Posts