Friday, April 19, 2024
- Advertisement -

థర్డ్​వేవ్​.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్​ఫుల్​..!

- Advertisement -

కరోనా థర్డ్​వేవ్​ చిన్నపిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎయిమ్స్​ డైరెక్టర్ గులేరియా మాట్లాడుతూ.. థర్డ్ వేవ్​ చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. మరోవైపు కొందరు వైద్య నిపుణులు మాత్రం చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ కూడా కొన్ని కీలక మార్గదర్శకాలను సూచించింది. చిన్నపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అవి ఏమిటంటే..

చిన్నపిల్లల్లో కోవిడ్​ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలి. పాజిటివ్​ అని తేలితే డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడాలి. అంతేకాక.. తరుచూ వారి శ్వాసతీరును గమనించాలి. సాధారణం కంటే ఎక్కువ సార్లు శ్వాస తీసుకుంటున్నట్టు గమనిస్తే వెంటనే డాక్టర్​ను సంప్రదించాలి. పిల్లల్లో కూడా కరోనా మూడు రకాలుగా వ్యాపిస్తుంది. కొంతమందిలో అసలు లక్షణాలు ఉండకపోవచ్చు. మరికొంత మందిలో మైల్డ్‌గా లక్షణాలు కనిపించవచ్చు.

Also Read: సీక్వెల్.. ఇప్పుడిదే సక్సెస్​ ఫార్ములా?

మరికొంతమందిలో మోడరేట్‌ గా లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఎక్కువ లక్షణాలు కనిపిస్తాయి.ఎక్కువ లక్షణాలు కనిపించడం.. జ్వరం తగ్గకపోవడం వంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే డాక్టర్​ను సంప్రదించాలి. పిల్లలకు సీటీ స్కాన్​ చేయడం ప్రమాదకరం .. కరోనా తీవ్రత తెలుసుకోవాలంటే వారికి చెస్ట్​ ఎక్స్​రే తీయవచ్చు.

లక్షణాలు ఏవి?
పిల్లలో కరోనా సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుది. ఒకవేళ ఒంటి మీద రాషెస్, కళ్లు ఎరుపుగా ఉండడం, నోట్లో, చేతులు, కాళ్లపైన ఎర్రటి మచ్చలు ఏర్పడడం, బీపీ పడిపోవడం, గుండె సమస్యలు, డయేరియా, వాంతులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేరాలి.అయితే పిల్లలకు సాధారణ లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందవద్దని.. లక్షణాలు ఎక్కువగా కనిపించి శ్వాసకు ఇబ్బంది కలిగితే మాత్రమే ఆస్పత్రిలో చేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:సోనూసూద్​ .. మరో సంచలన నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -