Thursday, April 18, 2024
- Advertisement -

చిరుతను కుమ్మేసిన గేదెలు!

- Advertisement -

గత ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇలాంటి సమయంలో అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు గ్రామాల్లో సంచరించడం మొదలు పెట్టాయి. ఇటీవల తెలంగాణలో చిరుతలు, పులుల సంచారాలు బాగా పెరిగిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో పులులు పశువులపై దాడి చేసిన ఘటనలు ఎన్నో జరిగాయి. వాటిలో కొన్ని ఆవులు, గేదెలు మృతి చెందాయి.

తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం బూర్గుపల్లి సమీప గుట్టల్లో గురువారం వింత ఘటన చోటుచేసుకుంది. అడవికి సమీపంలో దూడపై దాడికి ప్రయత్నించిన ఓ చిరుతను పశువులు మూకుమ్మడిగా దాడిచేసి కుమ్మేశాయి. దీంతో ఆ చిరుత నడుము, కాళ్లు విరిగి నడవలేని స్థితికి చేరుకుంది. పశువుల పాకల వద్దకు వెళ్లిన పశువుల కాపర్లకు గాయంతో నడవలేని స్థితిలో కింద పడి ఉన్న చిరుతపులి కనిపించింది.

ఈ దాడిలో ఒక గేదె కూడా గాయపడింది. గ్రామ సర్పంచ్ ఈ విషయం పోలీసులకు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ రెస్క్యూటీం చిరుతను సంరక్షించింది. చికిత్స కోసం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని జూపార్క్‌కు తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -