గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్,మరో యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గోపిచంద్ తాజా సినిమా పంతం.ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ రోజు(సోమవారం) విడుదల చేశారు.పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ స్టైలిష్ అప్పీల్‌తో ఆకట్టుకునే యత్నం చేశాడు.
ఓవైపు ఎంటర్‌టైన్‌మెంట్‌తో నేతల అవినీతిపై హీరో పోరాటం లాంటి సీరియస్ సబ్జెక్టును డైరెక్టర్ డీల్ చేశాడు. కోర్టు సీన్ సన్నివేశాన్ని హైలెట్ గా చూపించారు. ఈ సినిమాకు కే చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జూలైలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.మరి ఈ సినిమాతో అయిన గోపిచంద్ హిట్ కొడతాడో లేదో చూడాలి.