Sunday, April 28, 2024
- Advertisement -

శ్రీను వైట్ల కొత్త ప్రయోగం.. ఫలించేనా ?

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో సక్సస్ అనేది చాలా ముఖ్యం. స్టార్ హీరోగా ఎదగలన్నా, టాప్ డైరెక్టర్ గా కొనసాగాలన్నా కేవలం తీసే మూవీ సక్సస్ పైనే వారి కెరియర్ ఆధారపడి ఉంటుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ దర్శకుడు శ్రీను వైట్ల అనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు స్టార్ హీరోలకు అదిరిపోయే హిట్స్ ఇచ్చి ఆగ్ర దర్శకుడిగా కొనసాగిన వైట్ల.. ప్రస్తుతం అత్యంత డౌన్ ఫాల్ లో ఉన్నాడు. శ్రీను వైట్ల గురించి చెప్పాలంటే ” ఆగడు ” కు ముందు ” ఆగడు ” కు తరువాత అని చెప్పాలి. ఆ మూవీ ఫ్లాప్ తరువాత శ్రీను వైట్ల టేకింగ్ పై గట్టిగానే విమర్శలు వెల్లువెత్తాయి.

ఇక ఆ తరువాత రామ్ చరణ్ తో వచ్చిన ” బ్రూస్ లీ “, వరుణ్ తేజ్ తో వచ్చిన ” మిస్టర్ “, రవితేజ తో తీసిన ” అమర్ అక్బర్ ఆంథోనీ ” వంటి మూవీస్ కంప్లీట్ డిజాస్టర్స్ గా మిగలడంతో స్టార్ హీరోలు శ్రీను వైట్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక ఆ తరువాత శ్రీను వైట్లకు డేట్స్ ఇచ్చేందుకు ఏ హీరో కూడా దైర్యం చేయలేదు. దాంతో మూవీస్ కు చాలా గ్యాప్ ఇచ్చిన వైట్ల.. ఆ మద్య డీ మూవీ కి సిక్వల్ గా ” డీ డబుల్ డోస్ ” మూవీ ను మంచు విష్ణు తో అనౌన్స్ చేశాడు. కొంత భాగం షూటింగ్ కూడా చేసుకున్నా ఈ ప్రాజెక్ట్.. ఏమైందో తెలియదు గాని ఆ తరువాత ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.

దాంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. ఆ తరువాత ఎనర్జీటిక్ స్టార్ రామ్ తో ఓ మూవీ చేయబోతున్నాడని వార్తలు వచ్చినప్పటికి అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇక తాజాగా మ్యాచో స్టార్ గోపిచంద్ తో శ్రీనువైట్ల ఓ సినిమా చేయనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గోపిచంద్ కు స్క్రిప్ట్ కూడా వినిపించాడట. స్క్రిప్ట్ నచ్చడంతో గోపిచంద్ కూడా ఒకే అన్నట్లు సమాచారం. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఒకప్పుడు కామిడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వైట్ల.. తన తదుపరి ప్రాజెక్ట్ తోనైనా కం బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

Also Read

ప్రభాస్ కు బిగ్ షాక్.. ఆదిపురుష్ దెబ్బ !

రాజమౌళి.. తెలుగు సినీ “చరిత్రకోకడు”

బాలీవుడ్ పై బాలయ్య, బోయపాటి దండయాత్ర !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -