తకిట తకిట, పిల్ల జమీందార్ సినిమాలో హీరోయిన్ గా నటించిన హరిప్రియ గుర్తుందా..! తెలుగులో ఈ రెండు సినిమాల తర్వాత కూడా కొన్ని చిన్న చిత్రాల్లో నటించింది. కానీ హరిప్రియకు తెలుగులో సరైన బ్రేక్ రాలేదు. అందుకే ఇప్పుడు కన్నడ వైపు వెళ్తుంది. ఈ బ్యూటీకి కన్నడనాట మాత్రం మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
దాంతో హరిప్రియ తన అందాలతో పిచ్చెక్కిస్తుందట. తాజాగా నీర్ దోశె అనే సినిమాలో నటిస్తుంది హరిప్రియ. హరిప్రియ కారెక్టర్ నీర్ దోశె లో చాలా బోల్డ్ గా ఉంది. ఈ భామ స్టిల్స్ చూస్తుంటేనే సినిమాలో ఏ స్థాయిలో రెచ్చిపోయిందో అర్థమైపోతుంది. మందు, సిగరెట్ తాగుతూ స్విమ్ సూట్ లో హరిప్రియ ఇచ్చిన పోజు కన్నడనాట సంచలనాలు సృష్టిస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్, మేకింగ్ వీడియోస్ చూస్తుంటే సినిమాలో ఇంకెంతగా రెచ్చిపోయింది ఊహించుకోవచ్చు.
హరిప్రియకు జోడీగా జగ్గేష్ నటిస్తుండగా విజయ్ ప్రసాద్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. గ్లామర్ క్వీన్ సుమన్ రంగనాథన్ ఇందులో కీలకపాత్రలో నటిస్తుంది. ఆ మధ్య విడుదలైన మేకింగ్ వీడియోస్ కన్నడ నాట సంచలనాలు సృష్టించాయి. ఇవి చూపించే సినిమా బిజినెస్ పూర్తి చేస్తున్నారు దర్శకనిర్మాతలు. మొత్తానికి హరిప్రియ ముందు పద్దతిగా కనిపించిన చాన్స్ లు రాకపోవడంతో హద్దులు దాటేసింది.
{youtube}v=VYDu2V6HpkU{/youtube}
Related
