రాం గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన సత్య-2, 365డేస్ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనైకా సోటి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ హీరోయిన్ వ్యభిచారిగా మారింది. వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమాల తర్వాత కంటికి కనిపించకుండ పోయింది ఈ హీరోయిన్. ఇన్నాళ్ళకు వ్యభిచారిణిగా దర్శనమిచ్చింది. అయితే ఆమె వ్యభిచారిణిగా మారింది రియాల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్లో మాత్రమే.
తమిళ దర్శకుడు బద్రి వెంకటేష్ “సెమ్మ బోత ఆగతా”అనే చిత్రం ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అథర్వా హీరో గా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం వ్యభిచారిణిగా అనైకా సోటి నటిస్తోంది. ఈ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్స్ ని సంప్రదించిన చివరికి అనైకా సోటి అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నారట. అనైకా కూడా సినిమా స్టోరీ విని చాలా బాగుంది అని చెప్పిందట.
ఇక అనైకా రోల్ ఈ చిత్రంలో చాలా గ్లామర్, హాట్ గా కనిపిస్తోంది అని దర్శకుడు చెప్పాడు. కిక్కాస్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై హీరో అథర్వా ఈ చిత్రం ను నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రంకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది త్వరలోనే ఆడియోని రిలీజ్ చేస్తాం అని దర్శకుడు తెలిపారు.
Related
