Friday, April 26, 2024
- Advertisement -

కరోనా బాధితులకు ‘మనం సైతం’అంటున్న కాదంబరి కిరణ్

- Advertisement -

మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మిన కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న “మనం సైతం” కరోనా కష్ట కాలంలో ఎంతోమందిని ఆదుకుంది. ఈ నేపథ్యంలో చిత్రపురి కాలనీలో ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ బాధితులకు అండగా నిలబడేందుకు ‘మనం సైతం’ ముందుకొచ్చింది. వారందరికీ ఉచితంగా భోజన సదుపాయం, మందుల కిట్స్, శానిటైజర్, ఇమ్యూనిటీ పొడి, ఆక్సిజన్ సిలెండర్స్ అందించారు.

ఈ సేవా కార్యక్రమానికి చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, రుద్రరాజు రమేష్, టీమ్ సభ్యులు చేయూత అందించారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ఎంతో మంది పేద ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అందుకే సాయం కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది దగ్గరకు వెళ్లి సహాయం చేశాం. ప్రస్తుతం చిత్రపురి కాలనీలో కోవిడ్ పేషెంట్లకు సహాయం చేసేందుకు ముందుకొచ్చాం.

ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు భోజనం, మందుల కిట్, పీపీఈ కిట్, మాస్క్ లు, శానిటైజర్, ఇమ్యూనిటీ పొడి, ఆక్సీజన్ సిలిండర్ అందిస్తున్నాం. ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకొనేందుకు ఆక్సీమీటర్ కూడా ఏర్పాటు చేశామని.. చేతనైన సాయంకోసం ఎప్పుడైనా.. ఎవరికైనా.. ఎక్కడైనా ‘మనం సైతం’ సిద్ధం..’’ అన్నారు.

నా భర్తను చంపేందుకు కుట్ర చేస్తున్నారు.. రఘురామరాజు భార్య సంచలన కామెంట్స్

వర్షంలో తెగ ఎంజాయ్ చేసిన అనసూయ!

నాకు ఒక్క ఫోన్ చెయ్యండి.. శేఖర్ మాస్టర్ దాతృత్వం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -