Sunday, May 12, 2024
- Advertisement -

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు!

- Advertisement -

గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం బీభత్సం సృష్టించింది. అయితే ఈ నెల 12 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహయించి తర్వాత పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించారు. అయితే కరోనా లాక్ డౌన్ ఫలితాలు బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఈరోజు కరోనా కేసులు భారీగా తగ్గాయి.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,816 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,28,823 కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో 27 మంది మృతి చెందారు. ఇందులో 4,74,899 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 50,969 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో గత నెల రోజులుగా దాదాపు 74 మందికి కరోనా సోకినట్టు అక్కడి వైద్యులు గుర్తించారు.

దీంతో ఆస్పత్రిలోనే ప్రత్యేకంగా కొవిడ్‌ వార్డును ఏర్పాటు చేసి, కరోనా సోకిన వారిని మిగతా వారి నుంచి వేరు చేసి చికిత్స అందిస్తున్నారు. అలా ఇప్పటి వరకు 54 మందికి కరోనా పూర్తిగా నయం కావడంతో వారిని కొవిడ్‌ వార్డు నుంచి డిశ్చార్జ్‌ చేశారు.

మరోవైపు కరోనా కేసులు అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నట్లు సమాచారం. చాలా వరకూ జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య వందల్లో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

నా భర్తను చంపేందుకు కుట్ర చేస్తున్నారు.. రఘురామరాజు భార్య సంచలన కామెంట్స్

స్టార్ అవ్వడం కోసం ఎంతైన కష్టపడొచ్చు..?

ఏపిలో కరోనా మరణ మృదంగం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -