Saturday, May 4, 2024
- Advertisement -

దుబ్బాక లో కాంగ్రెస్ కు విమర్శనాస్త్రం దొరికినట్లేనా..?

- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అధికార పార్టీ హవా లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో కొట్టుకుపోయిందని చెప్పొచ్చు..  అసెంబ్లీ ఎన్నికల ఫలితంలో ఈ విషయం స్పష్టంగా తెలియగా ఇకపై కాంగ్రెస్ పార్టీ ఎలా కొనసాగుతుందో అని అందరు చూస్తున్నారు.. మంచి బలం , బలగం ఉన్న చోట కూడా కాంగ్రెస్ టీ.ఆర్.ఎస్ దెబ్బకు కుదేలైపోయింది.. అప్పటినుంచి కాంగ్రెస్ మరింత ఢీలా పడిపోయిందని చెప్పొచ్చు.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అస్సలు కోలుకోలేదు కాంగ్రెస్.. దీనికి తోడు తెలంగాణ లో బీజేపీ కూడా పుంజుకోవడంతో కాంగ్రెస్ కి వచ్చే ఆ తక్కువ సీట్లు కూడా రాకుండా పోయాయి.. ప్రజల్లో సైతం కాంగ్రెస్ పట్ల నమ్మకం సడలిపోతుంది..

సరైన నాయకుడు, నాయకత్వం లేకపోవడం వలన కాంగ్రెస్ పరిస్థితి ఇలా తయారైందని వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల విభేదాలు, రోడ్డున పడి రాని లేని అధికారం కోసం పోట్లాడి ప్రజల దృష్టిలో మరింత చీప్ అయిపోయారు.. ఇక పార్టీ ఇలా అయిపోవడానికి ముఖ్య కారణంగా ఉత్తమ్ కుమార్ ను నిందిస్తున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులూ.. ఇదిలా ఉంటె దుబ్బాక ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఎత్తులు పైఎత్తులు వేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది..

అయితే ఇప్పుడు అధికార పార్టీ ని విమర్శించి దుబ్బాక లో అధికారం చేజిక్కించుకునే ఓ అస్త్రం కాంగ్రెస్ కు దొరికిందని తెలుస్తుంది. అదే ఎల్‌ఆర్ఎస్. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రెవిన్యూ సంస్కరణలు తీసుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన లేఔట్ రెగ్యూలేషన్ స్కీమ్‌ను ప్రకటించారు. దీని ప్రకారం… ప్రతీ ఖాళీ స్థలం.. ఇంటి స్థలం.. ఇలా ఏ ఆస్తి ఉన్నా.. ప్రతీ ఒక్కరూ అదనంగా పన్ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా.. రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. అనేక నిబంధనలు పెట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజల్లో ఓ భావన పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కాగా ఉపయోగించుకుని దుబ్బాక లో ఎన్నికల ప్రచారం చేయాలనీ భావిస్తుంది. మరి ఈ అంశం కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఏవిధంగా దోహదపడుతుందో చూడాలి..

కెసిఆర్ కి షాక్ ఇచ్చేలా గులాబీ నేతను రంగంలో కి దించిన కాంగ్రెస్..?

తెలంగాణ లో కేసీఆర్ మాటే నెగ్గుతుందా..?

ఆ ఎన్నికలపైనే కెసిఆర్ ఫోకస్..!

ఉత్తమ్ పోస్ట్ ఊడుతుందా.. కాంగ్రెస్ నేతలే చెప్తున్నారుగా.?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -