హీరోయిన్ త్రిష పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?

- Advertisement -

ఒకప్పుడు హీరోయిన్ గా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో త్రిష ఒకరు. తెలుగు తమిళంలోని స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే గత కొంతకాలం నుంచి ఈమెకు అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరం అయింది. ఈ క్రమంలోనే లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేసిన పెద్దగా కలిసి రాలేదు.

- Advertisement -

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే హీరోయిన్ పెళ్లిపీటలు ఎక్కబోతోందని తెలుస్తోంది. గతంలో త్రిష, రానాల మధ్య ప్రేమ ప్రయాణం సాగుతుందనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే ఆ వార్తలను ఖండిస్తూ వీరిద్దరు స్నేహితులని తెలిపారు. ఆ తరువాత తమిళ హీరో శింబుతో త్రిష పెళ్లి అనే వార్తలు వినిపించాయి. అయితే ఇందులో కూడా నిజం లేదని కొట్టిపారేశారు.

Also rea:ప్రేమలో పడిన యాంకర్ వర్షిని.. ఫోటోలు వైరల్!

తాజా సమాచారం ప్రకారం త్రిష తన కుటుంబానికి ఎంతో సన్నిహితులైన ఓ బిజినెస్ మాన్ నీ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే అతను ఎవరు? ఏంటనేది మాత్రం తెలియడం లేదు. మే 4వ తేదీన త్రిష పుట్టిన రోజు కావడంతో తన పుట్టినరోజు సందర్భంగా తన చేసుకోబోయే వరుడు గురించి, తన పెళ్లి గురించి ప్రకటిస్తుందేమోననే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే ఈ విషయంపై త్రిష స్పందించే వరకు వేచి చూడాలి.

Also read:అతనితో ఒకే బెడ్ పై అలా ఉన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటో వైరల్!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -