Wednesday, May 1, 2024
- Advertisement -

” హిట్ 3 ” లో త్రిబుల్ బొనాంజా !

- Advertisement -

థ్రిల్లర్ మూవీస్ స్పెసలిస్ట్ అడవి శేష్ నటించిన తాజా చిత్రం ” హిట్ 2 సెకండ్ కేస్ “. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి కూడా ఈ మూవీపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ వచ్చింది చిత్రయూనిట్. అందుకు తగ్గట్టుగానే మూవీపై కూడా విపరీతమైన బజ్ ఏర్పడింది. ఇక ఎట్టకేలకు మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరిస్తూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది మూవీ. మూవీ కాస్త రొటీన్ గానే అనిపించినప్పటికి గ్రీప్పింగ్ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ శైలేష్ ఆడియన్స్ ను కట్టి పడేశాడనే చెప్పాలి. ఇక ఇన్వెస్టిగేటివ్ కాప్ రోల్ లో అడవి శేష్ మరోసారి తన మార్క్ చూపించాడు. .

ఈ మూవీతో థ్రిల్లర్ మూవీస్ స్పెషలిస్ట్ గా శేష్ మరోసారి నిరూపించుకున్నాడు. ఇక మూవీకి జాన్ స్టివర్ట్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలం అనే చెప్పాలి. మొత్తానికి దర్శకుడు శైలేష్ కొలను లోని హిట్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన హిట్ 2 కు కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. హిట్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన మొదటి భాగం హిట్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కూడా హిట్ అయింది.

ఇక లేటెస్ట్ గా వచ్చిన హిట్ 2 కూడా సూపర్ హిట్ కావడంతో ఇక రాబోయే హిట్ 3 పై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. కాగా హిట్ 3 లో హీరో ఎవరనేది హిట్ 2లోనే రివిల్ చేశారు డైరెక్టర్ శైలేష్ కోలను, రివిల్ చేసిన అంశాలను బట్టి చూస్తే హిట్ 3లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఉండబోతున్నాడనే విషయం తెలుస్తోంది. ఇక అంతే కాకుండా హిట్ 1 లో విశ్వక్ సేన్ అలాగే హిట్ 2 నటించిన అడవి శేష్ పాత్రలు కూడా హిట్ 3 లో కాసేపు మెరవనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి హిట్ యూనివర్స్ లో భాగంగా థ్రిల్లర్ మూవీస్ అందిస్తున్న శైలేష్ కోలనూ హిట్ 3 ని ఇంకెంత గ్రీప్పింగ్ గా తెరకెక్కిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఆచార్య ఎఫెక్ట్.. పాపం కొరటాల !

బుచ్చిబాబుకు చరణ్ ఫ్యాన్స్ వార్నింగ్ ?

మహేశ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -