పక్షవాతం రావడానికి అసలు కారణాలు తెలుసా ?

Do you know the real causes of paralysis?
Do you know the real causes of paralysis?

నేటి రోజుల్లో మారుతున్న కాలక్రమేణ మన అలవాట్లలోనూ, మన జీవన విధానంలో కూడా మార్పులు వస్తుంటాయి. ఫలితంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు మనలను చుట్టుముడుతూ ఉంటాయి. అయితే కొన్ని సమస్యలను సాధారణంగానే మనం ఎదుర్కొంటూ ఉంటాము. కానీ మనం ఎదుర్కొనలేని ఆరోగ్య సమస్యలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో పక్షవాతం కూడా ఒకటి. ఈ ఆరోగ్య సమస్యతో బాధపడే వారు ఎంతటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారో అందరికీ తెలుసు. ఈ పక్షవాతం అనేది నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి కావడంతో శరీరంలోని కళ్ళు లేదా చేతులు అవయవాలు పడిపోవడం అనగా ఎలాంటి చలనానికి సహకరించకపోవడం. వారి స్వ పనులు చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. మరి ఇంతటి కష్టభరితమైన ఈ వ్యాది రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. .

అయితే ఆ కారణాలపై కనీస అవగాహన ఉండడం వల్ల ఈ పక్షవాతం వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు. పక్షవాతానికి దారితీసే కారణాలను పరిశీలిస్తే.. ముఖ్యంగా మనం చెడు అలవాట్లుగా భావించే ధూమపానం, మద్యపానం వంటికి అధికంగా సేవించడం లేదా డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి,. ఎందుకంటే ఈ ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వంటికి మెదడు నాడీ వ్యవస్థపై అధికంగా ప్రభావం చూపుతాయి. ఫలితంగా పక్షవాతానికి దారితీసే అవకాశం లేకపోలేదు. ఇక హైకోలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, అధిక ఒత్తిడి, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఉన్నవారికీ కూడా పక్షవాతం త్వరగా అటాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వ్యాది వచ్చిన తరువాత ఇబ్బంది పడే కన్నా.. వ్యాది రాకముందే పక్షవాతం వైపుగా ప్రభావితం చేసే పై సమస్యలు ఉన్నట్లైతే ఏ మాత్రం నిర్లక్షం చేయక వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఇక ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు.. ఆ అలవాట్లను త్వరగా మానుకోవడం మరి మంచిది.

ఇవి కూడా చదవండి

పుడ్ పాయిజన్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

గ్యాస్ సమస్య ఉందా.. ఇలా చేయండి!

చలికాలంలో జుట్టు సమస్యలకు చెక్ పెట్టండిలా !