Saturday, April 20, 2024
- Advertisement -

ఆ విషయంలో యాంకర్ సుమకు పోటీ ఇస్తున్న రాజీవ్ కనకాల?

- Advertisement -

సినిమా రంగంలోనూ, బుల్లితెరపై నటుడు రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కుమారుడిగా రాజీవ్ కనకాల అటు వెండితెరపై,ఇటు బుల్లితెరపై ఎన్నో సినిమాలలో, సీరియల్స్ లో నటించారు.ఎంతో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజీవ్ కనకాల అడపాదడపా తన భార్య నిర్వహించే కార్యక్రమాలలో కూడా చేశారు.

రాజీవ్ కనకాల భార్య సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనకు ఏ ఛానల్ ఆన్ చేసిన ఏదో ఒక కార్యక్రమం ద్వారా సుమ కనిపిస్తారు. అంతటి క్రేజ్ ఉన్న సుమకు పోటీ ఇవ్వడానికి రాజీవ్ కనకాల సరికొత్త అవతారమెత్తారు. తాజాగా రాజీవ్ కనకాల బుల్లి తెరపై ఓ కార్యక్రమానికి యాంకర్ గా విధులు నిర్వహించనున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే “రెచ్చిపోదాం బ్రదర్” అనే షోలో హోస్ట్‌గా రాజీవ్ కనకాల కనిపించనున్నారు.

Also read:అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో.. ఎవరంటే?

ఈ క్రమంలోనే రాజీవ్ కనకాల కొన్నిసార్లు రావడం లేటు అవ్వొచ్చేమో కానీ.. రావడం పక్కా అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత జై లవకుశ సినిమాలోని రావణ అనే పాట ద్వారా వేదిక పైకి వచ్చారు. రాజీవ్ కనకాల హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. జూన్ 7 నుంచి ప్రారంభమైన ఈ ఈ కార్యక్రమాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మల్లెమాల నిర్మించారు.ఇప్పటికే రాజు కనకాల భార్య సుమ యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు మరి రాజీవ్ కూడా ఏ విధమైన గుర్తింపును సంపాదించుకుంటారో చూడాలి.ఇక సినిమాల విషయానికొస్తే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రాజీవ్ కనకాల ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Also read:రామ్ సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -