Tuesday, April 30, 2024
- Advertisement -

చందమామ కోసం సీనియర్ల క్యూ.. పెళ్లి తర్వాత కూడా జోరు తగ్గట్లే..!

- Advertisement -

గౌతమ్​ కిచ్లతో పెళ్లి తర్వాత కూడా చందమామ కాజల్​.. స్పీడు, జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆమె చిరంజీవితో ఆచార్య మూవీలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్​ ఆల్మోస్ట్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఇండియన్​ – 2లోనూ హీరోయిన్​గా చేస్తోంది. ఇక ఇళయ దలపతి విజయ్ కూడా తన తర్వాతి మూవీకి కాజల్​నే సెలెక్ట్​ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.కాగా కాజల్​కు ఇప్పుడు బాలీవుడ్​ నుంచి ఓ బంపర్​ ఆఫర్​ దక్కినట్టు సమాచారం.

అజయ్ దేవగణ్ సినిమాలో కాజల్​కు హీరోయిన్​గా చాన్స్​ దక్కినట్టు టాక్​. గతంలో వీరిద్దరూ సింగం హిందీ రీమేక్​ లో నటించారు. కాజల్​కు మరోసారి అజయ్​తో రొమాన్స్​ చేసే ఛాన్స్ దక్కిందట. మరో ఇంట్రెస్టింగ్​ విషయం ఏమిటంటే ఈ సినిమా కూడా సౌత్​ రీమేకే. కార్తీ హీరోగా నటించిన ఖైదీ సూపర్​ హిట్​ అయిన విషయం తెలిసిందే. ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమా రూపొందింది.నిజానికి ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్​ ఉండదు.. కథ కూడా చాలా డిఫరెంట్​గా ఉంటుంది.

Also Read: స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..

అయితే దీన్ని హిందీలో రీమేక్​ చేయబోతున్నారు. అక్కడ అజయ్​ దేవగన్​ హీరోగా నటిస్తున్నారు.అయితే మాతృకలో హీరోయిన్​ పాత్ర లేకపోయినా.. హిందీ వర్షన్​లో హీరోయిన్​ క్యారెక్టర్​ సృష్టిస్తున్నారట. ఈ పాత్రకు కాజల్​ను ఎంపిక చేసుకున్నారట. సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్ల సమస్య తీవ్రంగా ఉంది. వారి పక్కన నటిస్తే ఇక యువ హీరోల పక్కన ఛాన్స్ లు దొరకవని యంగ్ హీరోయిన్లు ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేస్తున్నారు. అలాంటి హీరోలందరికీ సీనియర్ హీరోయిన్ కాజల్ ఇప్పుడు ఓ ఆప్షన్ లా మారింది. సీనియర్ హీరోలందరినీ చుట్టేస్తోంది ఈ భామ.

Also Read: త్వరలో చిరంజీవి అంబులెన్స్​లు? నిజమెంత..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -