Sunday, May 5, 2024
- Advertisement -

ఓరి నాయనో.. ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

- Advertisement -

పూర్వం గంపెడు పిల్లలను కని సల్లగా ఉండమ్మ అంటూ వివాహ బంధంతో ఒక్కటైన దంపతులను దీవించేవారు పెద్దలు. పది మంది పిల్లలను కని వంశ వృక్షాన్ని పెంచు తల్లీ అని దీవించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అంటున్నారు. అయితే పది మంది పిల్లలను కనాలంటే పదిసార్లు గర్భం దాల్చితే ఆడవారు పడే బాధలు వర్ణణాతీతం. కానీ ఒకే కాన్పులో ఆ పదిమంది పిల్లలు పుడితే నిజంగా అది వండర్ అవుతుంది.. అలాంటి ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది.

ఒకే కాన్పులో ఏకంగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ.. ఒకే కాన్పులో ఇంతమంది పిల్లలు పుట్టడం తొలిసారి కావచ్చని.. అదే ప్రపంచ రికార్డు అవుతుందని అంటున్నారు. 37 ఏళ్ల గోసియామే థమారా సిథోలే 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఏడుగురు మగ పిల్లలు కాగా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు అందరూ మంచి ఆరోగ్యంతో ఉండటం మరో విశేషం. గొసియామీ థామర సిట్‌హోల్‌ (37) గతంలో కవలలకు జన్మనిచ్చింది. రెండోసారి సహజ గర్భం దాల్చిన 7 నెలల 7 రోజులకు నెలలు నిండకుండానే 10 మందికి జన్మనిచ్చినట్లు చెబుతున్నారు.

ఆరు నెలల గర్భం సమయంలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపారని, ఆ తర్వాత మరోసారి స్కాన్ చేసినప్పుడు 8 మంది ఉన్నట్లు గుర్తించారని, పిల్లలు పుట్టినప్పుడు మాత్రం మొత్తం 10 మంది ఉన్నట్లు తేలిందని తెలిపారు. ఏ ఉద్యోగం లేకపోయినా వీరిని జాగ్రత్తగా చూసుకుంటానని తండ్రి తెబోగో సోతెత్సీ తెలిపారు. ఇంతమంది పిల్లలు పుట్టడం ఆనందంగా ఉందని వివరించాడు. గత నెలలో మొరాకోలో హాలిమా సిస్సే అనే మహిళ 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె రికార్డును గోసియామే థమారా సిథోలే బ్రేక్ చేశారు.

భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన స్టార్ హీరోలు.. ఒక్క సినిమాకు?

అలాంటి పాత్రలకే ఓకే చెబుతుందట ఫిదా పిల్ల

ఎంపీ రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -