Friday, April 26, 2024
- Advertisement -

త్వరలో చిరంజీవి అంబులెన్స్​లు? నిజమెంత..!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాను అగ్ర హీరోగా ఎదిగినప్పటినుంచి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ వంటివి నెలకొల్పి ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు. గత ఏడాది కోవిడ్ టైం లోనూ సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటీ) ఏర్పాటు చేసి సినీ రంగానికి చెందిన వారిని ఆదుకున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ లోనూ తన సహాయాలను కొనసాగించారు. సినీ నటీనటులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో దాదాపు రూ. 36 కోట్లు ఖర్చుపెట్టి.. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు.

అయితే ఇన్ని సేవా కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ, ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ ఒక వర్గం చిరంజీవిని ట్రోల్ చేస్తూ వచ్చింది. తెలుగు మీడియా కూడా చిరంజీవి చేస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోని చిరంజీవి తాజాగా మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో అంబులెన్స్​లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాడట. రెండు రాష్ట్రాల్లో ఉచితంగా అంబులెన్స్ సేవలు అందించాలని చిరంజీవి యోచిస్తున్నాడట.

Also Read: మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్..!

ఇందుకోసం ఎన్ని వాహనాలు కొనుగోలు చేయాలి. ఎంత మొత్తం ఖర్చవుతుంది? తదితర వివరాలపై ఆరా తీస్తున్నాడట చిరు. అయితే ఈ కార్యక్రమం ఎప్పటి నుండి మొదలవుతుంది అన్న విషయమై విషయంపై క్లారిటీ లేదు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కరోనా ఫస్ట్​వేవ్​, సెకండ్​ వేవ్​ టైంలో అంబులెన్స్​లు దొరకక, వారు చార్జ్ చేసే మొత్తాన్ని భరించలేక చాలా మంది ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. బైకుల్లో, రిక్షాల్లో మృతదేహాలను తరలించిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో చిరంజీవి ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

Also Read: 50 లక్షల వ్యూస్​ కొల్లగొట్టిన లాహేలాహే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -